Homeఆంధ్రప్రదేశ్‌Home Minister Anitha: హోం మంత్రి వారికే ఫిక్స్.. ఈ విమర్శలకు కారణం అదే

Home Minister Anitha: హోం మంత్రి వారికే ఫిక్స్.. ఈ విమర్శలకు కారణం అదే

Home Minister Anitha: ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మంత్రులపై విమర్శలు రావడం పరిపాటిగా మారింది.అంటే పాలకులు డమ్మీ క్యాబినెట్ ను ఎంచుకుంటున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనిత శాఖా పరంగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతుండడం పై డిప్యూటీ సీఎం పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ రివ్యూలు జరపాలని హోం శాఖ మంత్రికి సూచించారు. ఇలానే కొనసాగితే తాను హోం శాఖను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే అది వంగలపూడి అనితను హెచ్చరించినట్టా? లేకుంటే వైసీపీ నేతలకు హెచ్చరించినట్టా? అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో నేర సంస్కృతి వైసిపి హయాం నుంచి కొనసాగుతోందని.. దానికి చెక్ చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే వైసిపి మాత్రం తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది. ఏకంగా కూటమి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయంటూ ప్రచారం విస్తృతం చేస్తోంది. అయితే మ్యాటర్ ఇప్పుడు అది కాదు.గతంలో వైసిపి హయాంలో హోం శాఖను ఇద్దరు మహిళా మంత్రులు నిర్వర్తించారు. వైసిపి తొలి క్యాబినెట్లో మేకతోటి సుచరిత, విస్తరణలో దానేటి వనిత పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇద్దరూ అప్పట్లో డమ్మీ లేనని కామెంట్స్ వినిపించేవి. వారి హయాంలో సైతం శాంతిభద్రతలు క్షీణించాయన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వారు సైతం తమ శాఖలపై అంతగా ప్రభావం చూపలేదు అన్న కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు వంగలపూడి అనిత విషయంలో సైతం అదే తరహా ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రుల పనితీరుపై మరోసారి చర్చ జరుగుతోంది.

* చిన్న పని కూడా జరగదు
వైసిపి హయాంలో కానిస్టేబుల్ బదిలీ కూడా హోం శాఖ మంత్రి చేయలేకపోయారన్న కామెంట్స్ ఉన్నాయి. పేరుకే వారు హోం మంత్రి అని.. కేవలం హోదాను, దర్పాన్ని ప్రదర్శించేందుకేనన్న విమర్శలు కూడా ఉన్నాయి. విస్తరణలో పదవి కోల్పోయిన మేకతోటి సుచరిత అప్పట్లో ఇటువంటి కామెంట్స్ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే తరహా ప్రచారం నడిచింది. అయితే అటు తరువాత హోం శాఖ మంత్రిగా పదవి చేపట్టిన దానేటి వనిత సైతం హోంశాఖ పై పెద్దగా ప్రభావం చూపలేదు. హోం శాఖ మంత్రి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రివ్యూలు జరిపినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడిచింది.

* వ్యూహాత్మక ఎంపిక
అయితే హోం శాఖ మంత్రుల ఎంపికలో పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. మహిళలు ఆపై వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ఆ పదవులు కేటాయిస్తున్నారు. ఇది ముమ్మాటికీ వ్యూహాత్మకమే అని తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్ధులు బురద జల్లినప్పుడు అడ్డుకునేందుకు వారైతే సరిపోతారని భావించి వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం హోంశాఖ మంత్రులు డమ్మీలుగా మారడం వల్లే తమ శాఖను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బలమైన చర్చ కూడా నడుస్తోంది. అందుకే హోం మంత్రిత్వ శాఖను బలమైన నేతకు అప్పగిస్తే ఫలితం ఉంటుందన్న టాక్ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular