Housing Scheme: ఏపీలో గృహ నిర్మాణ( housing scheme) లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల యూనిట్ విలువకు మించి అదనపు సాయం చేయాలని నిర్ణయించింది. అదనపు సాయానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేశారు. కానీ వాటి నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయాయి. దీంతో అదనపు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అదనపు సాయం ఉత్తర్వులు గురించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రత్యేక ప్రకటన జారీ చేశారు.
Also Read: విజయసాయి రెడ్డికి బిగ్ షాక్.. ఆ కేసుల్లో సిఐడి నోటీసులు!
* అసంపూర్తిగా ఇళ్లు
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లు( houses sanctioned ) అసంపూర్తిగా ఆగిపోయాయి. అటువంటి వాటిని పూర్తి చేసేందుకు అదనపు సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, పీఎం జన్మన్ పథకం.. తదితర ఇళ్లకు ఈ అదనపు సాయం వర్తిస్తుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 6.16 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. దీనికోసం ప్రభుత్వం రూ. 3330 కోట్ల నిధులను అదనంగా ఖర్చు చేయనుంది. పివిటిజిలకు లక్ష, ఎస్టీలకు రూ.75,000, ఎస్సీలకు రూ.50,000, బీసీలకు రూ.50,000 సాయం అందనుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా 2029 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డ్వాక్రా సభ్యులకు సున్నా వడ్డీ పై 35 వేల రూపాయల రుణ సౌకర్యం అందించాలని నిర్ణయించారు.
* ఉచితంగా ఇసుక సరఫరా
మరోవైపు ఇంటి నిర్మాణానికి( house construction) ఉచిత ఇసుక సరఫరా, ఆ ఇసుక రవాణా కోసం 15000 చొప్పున చార్జీలు అందిస్తామని కూడా మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ జూన్లోపు 3 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 1.25 లక్షల గృహాలు పూర్తి చేసినట్లు ప్రకటించారు. మరో 7.35 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయని.. వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం అందించే అదనపు సాయాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని మంత్రి పార్థసారథి ప్రకటించారు.
Also Read: టీడీపీకే ఆ అను‘కుల’ మీడియా.. జనసేనకు ఏం ప్రయోజనం లేదా?*