https://oktelugu.com/

Telugu Media: దేశంలోనే టాప్ వార్తాపత్రిక.. 26 కోట్ల జీతాలు చెల్లించలేక ఆపసోపాలు!

మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. ప్రింట్ మీడియా పరిస్థితి బాగోలేదని.. ఇకపై బాగుండదని.. వచ్చే రోజుల్లో అసలు ఉండదని.. పెద్దపెద్ద మీడియా హౌస్ లే డిజిటల్ వైపు వస్తున్న తరుణంలో.. ప్రింట్ మీడియా ఇకపై మనుగడ సాగించేది దాదాపు కష్టమే.. మహా అయితే ఈ ఐదేళ్లు కనా కష్టంగా సాగుతుందేమో..

Written By: , Updated On : January 27, 2025 / 01:08 PM IST
Telugu Media (1)

Telugu Media (1)

Follow us on

Telugu Media: ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ సంగతి అంటే.. దేశంలోనే తోపు తురుంఖాన్ న్యూస్ పేపర్లు ఎడిషన్లను మూసుకుంటున్నాయి. చాలావరకు డిజిటల్ బాట పడుతున్నాయి. డిజిటల్ విషయంలోనూ సబ్ స్క్రిప్షన్ ను తెరపైకి తెచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, హిందుస్థాన్ టైమ్స్, మలయాళ మనోరమ, దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్, దిన తంతి వంటివి ఆల్రెడీ ఈ బాటలోకి వచ్చేసాయి. మిగతా మీడియా హౌసులు కూడా ఇదే బాటలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి కానీ.. ఎక్కడ తేడా కొడుతోంది. అందువల్లే అవి వెనుకా ముందు ఆలోచిస్తున్నాయి. అయితే దేశంలోనే టాప్ స్థానంలో.. తెలుగులోనూ అదే స్థాయిలో ఉన్న ఓ పత్రికకు మాత్రం మార్కెట్ కిటుకులు తెలియడం లేదు. పైగా ఆ పత్రిక తన కార్డ్ టారిఫ్ ను చాలావరకు తగ్గించింది. వాస్తవానికి ఈ పత్రిక యాజమాన్యం కార్డ్ టారిఫ్ లో ఏమాత్రం వెనకడుగు వేయదు. రూపాయి కూడా తగ్గించదు. కానీ పరిస్థితులు ఇప్పుడు బాగో లేకపోవడంతో తగ్గించక తప్పడం లేదు. తగ్గి ఉండక సాధ్యం కావడం లేదు. అందువల్లే టారిఫ్ ధరను అమాంతం తగ్గించుకుంది. అయినప్పటికీ ఈనెల జీతాల బిల్లు క్లియర్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతోంది.

దారుణంగా ఉందట

ఆ పత్రికలో పనిచేస్తున్న ఓ పెద్ద స్థాయి ఉద్యోగి ఇటీవల తన అంతరంగీకులతో మాట్లాడుతుండగా ఈ విషయాన్ని బయట పెట్టేసాడట..” నేను ఆ పత్రికలో దాదాపు పాతిక సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదురయ్యాయి. ప్రభుత్వాలు కక్ష కట్టినప్పుడు.. కోర్టులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఈ స్థాయిలో ఆర్థిక కష్టాలు ఎదురు కాలేదు.. రెవెన్యూ పెంచుకోవడానికి మేనేజ్మెంట్ కార్ట్ టారిఫ్ ను చాలావరకు తగ్గించింది. కానీ మేనేజ్మెంట్ ఊహించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. ఈనెల జీతాల బిల్లు క్లియర్ చేయడానికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనుకూల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇలా ఉందంటే.. భవిష్యత్తు కాలం అగమ్య గోచరమే. అందువల్లే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలనిపిస్తోందని” అతడు వ్యాఖ్యానించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు కాస్త బయటికి పొక్కడంతో ఒకసారిగా ఆ మేనేజ్మెంట్ పరిస్థితి తెలిసిపోయింది. అంటే ఇన్నాళ్లు బయటికి బాగానే కనిపించిన ఆ పత్రిక పరిస్థితి మేడిపండు చందమేనని తేలిపోయింది. టాప్ స్థానంలో ఉన్న ఆ పత్రిక పరిస్థితి అలా ఉంటే.. ఇక మిగతా వాటి సంగతి చెప్పాల్సిన పనిలేదు. మిగతా వాటిల్లో రెండు మూడు మినహా మిగతా పత్రికలు సరైన సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. రెండు మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నాయి. ఇక ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు..