spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Government : ఆ మూడు కేసులు సిఐడికి.. ఏపీ ప్రభుత్వం సంచలనం.. వైసిపి నేతల్లో...

AP Government : ఆ మూడు కేసులు సిఐడికి.. ఏపీ ప్రభుత్వం సంచలనం.. వైసిపి నేతల్లో టెన్షన్!*

AP Government :  ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు కేసులను సిఐడి విచారణకు అప్పగించాలని డిసైడ్ అయ్యింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి,సినీ నటి కాదంబరి జెత్వాని కేసులను సిఐడి కి అప్పగిస్తూ డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసిపి ముఖ్య నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.వైసిపి ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ఇంటితో పాటు టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన సమితి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో పురోగతి వచ్చింది. మరోవైపు ముంబై నటి జెత్వానిని వైసీపీ నేతలు వేటాడారు. వెంటాడినంత పని చేశారు. ఈ కేసులో వైసిపి హయాంలో నాటి సీఎంవో, డిజిపి కార్యాలయం తో పాటు విజయవాడ కమిషనరేట్ లో పనిచేసిన కీలక పోలీస్ అధికారులపై అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణ కొనసాగుతోంది. పోలీస్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టయ్యారు కూడా. అయితే ఈ కేసును సైతం ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో టిడిపి కార్యాలయం పై దాడి జరిగింది. ఆ కేసులో సైతం ఇప్పుడు కదలిక వచ్చింది. దానిని సైతం సీఐడీకి అప్పగిస్తే ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు చంద్రబాబు నివాసం పై సైతం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ కేసును సైతంసిఐడికి అప్పగించింది ప్రభుత్వం.

* అప్పట్లో తేలికపాటి కేసులు
అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఈ కేసులను చాలా తేలిగ్గా తీసుకుంది. చిన్నపాటి కేసులను నమోదు చేసి చేతులు దులుపుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో సీరియస్గా దృష్టి పెట్టింది. ఈ కేసుల తీవ్రత, వాటి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సిఐడి కి బదిలీ చేయాలని నిర్ణయంతో.. వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న నేతలను పోలీసులు విచారించారు. ప్రాథమిక నివేదికను సైతం తయారు చేశారు. ఇలా విచారణను ఎదుర్కొన్న నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి.

* వల్లభనేని వంశీ టార్గెట్
ముఖ్యంగా గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. మిగిలిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వారి విచారణకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటి పై దాడి కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు విచారించారు. ఈ రెండు కేసుల్లో వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు నిందితులుగా ఉన్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేత సజ్జల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ మూడు కేసులు సిఐడి కి అప్పగించడంతో ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న వైసీపీ నేతలు తెగ భయపడిపోతున్నారు.

ముంబై నటి కేసులో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు ఎంటర్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ పారిశ్రామికవేత్త కుటుంబం పై సదరు నటి వేసిన కేసును వెనక్కి తీసుకునేలా.. ఆమెను విజయవాడ తీసుకొచ్చి వేధింపులకు గురి చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి వైసిపి ప్రభుత్వంతో పాటు పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నేత తెరవెనుక నాటకం ఆడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. ఇప్పుడు ఏకంగా సిఐడికి ఈ కేసు అప్పగించడంతో పెద్ద తలకాయలపై గట్టిగానే చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ మూడు కేసులు వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular