CM Chandrababu : జగన్ గురువును దెబ్బకొట్టాక చంద్రబాబు ఏం చేయబోతున్నారు.. ప్లాన్ ఏంటి?*

2019లో జగన్ అంతులేని విజయం సాధించారు. ప్రజలు జగన్ కు వన్ చాన్స్ ఇచ్చారు. ప్రజలు అవకాశం ఇవ్వడమే కాదు చాలా రకాల అంశాలు దోహదపడ్డాయి. అయితే జగన్ కోసం చేసిన యాగాలు ఫలించాలని స్వామి స్వరూపానంద భావించారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ప్రభుత్వం సైతం స్వామీజీకి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఏపీలో అధికారం మారడంతో స్వామీజీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

Written By: Dharma, Updated On : October 20, 2024 1:06 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu :  వైసిపి వైఫల్యాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ప్రతి చిన్న నిర్ణయాన్ని పునసమీక్షిస్తోంది.అందులో భాగంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఎంతోమంది స్వామీజీలు ఉన్నా..గత ఐదేళ్లుగా జగన్ మాత్రం స్వరూపానంద స్వామికిచాలా ప్రాధాన్యమిచ్చారు.తన మిత్రుడు కేసీఆర్ సలహా మేరకు స్వామి స్వరూపానందకు శిష్యుడిగా మారారు జగన్.ఆయన చేసిన యాగఫలమే తన విజయమని భావించారు జగన్. అందుకే గత ఐదేళ్లుగా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.అడపాదడపా విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు.స్వామీజీ కి సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారు.అధినేత అలా చేయడంతో మంత్రులు సైతం క్యూ కట్టారు.వైసీపీ శ్రేణులు సైతం స్వామీజీ సేవలో తరించాయి. అప్పటివరకు సామాన్య భక్తులు క్యూలో ఉండేవారు.అప్పటి నుంచి మాత్రం రాజకీయ భక్తులు ప్రారంభమయ్యారు. ప్రభుత్వంలో కూడా స్వామీజీకి ఎనలేని ప్రాధాన్యం దక్కేది. ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించే స్థాయికి స్వామీజీ ఎదిగారు. చివరకు టీటీడీ ట్రస్ట్ పోర్టు ఉన్నా.. స్వామీజీ మాట చెల్లుబాటు అయ్యేది. అటు స్వామీజీ విన్నపం మేరకు విశాఖలో శారదా పీఠానికి భూములు సైతం కేటాయించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడంతో స్వామీజీ సైలెంట్ అయ్యారు. తాజాగా శారదా పీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ విషయంలో టీటీడీకి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

* వైదిక యూనివర్సిటీకి 15 ఎకరాల కేటాయింపు
విశాఖ శారదా పీఠం భీమిలి ప్రాంతంలో వైదిక యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి 15 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం కేటాయించింది.దాదాపు 125 కోట్ల రూపాయలువిలువ చేసే భూమిని నామమాత్రపు ధరకు.. అంటే ఎకరాను లక్ష రూపాయలకు అందించింది జగన్ సర్కార్. అయితే అదే సమయంలో తెలంగాణ సర్కార్ సైతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భూమిని దృష్టిలో పెట్టుకొని స్వామీజీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలన దక్షుడు అని కొనియాడారు. చంద్రబాబు తో తనకు సంబంధం ఉందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ పొగడ్తలేవి ఆ భూమిని కాపాడడంలో పనికి రాలేదు. తిరిగి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనంచేసుకునేందుకు నిర్ణయించడంతో స్వామి స్వరూపానందకు షాక్ తగిలినట్లు అయ్యింది.

* జగన్ నిర్ణయాలపై సీరియస్
అయితే జగన్ సర్కారు వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటుందో ఈ ఘటన ద్వారా అర్థమైంది. సాధారణంగా పీఠాధిపతులు అంటే దైవంతో సమానులని భావిస్తారు. అయితే గత ఐదేళ్లుగా శారదా పీఠం రాజకీయ కేంద్రంగా మారిపోయింది. వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. అయినా సరే శారదా పీఠం జోలికి చంద్రబాబు సర్కార్ రాదని అంతా భావించారు. తెలుగుదేశం పార్టీలోని సన్నిహితుల ద్వారా స్వామీజీ లాబీయింగ్ కూడా చేశారు. కానీ అవేవీ పనిచేయలేదు. జగన్ సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు శారదా పీఠానికి కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడం ద్వారా తన తదుపరి చర్యలపై సంకేతాలు ఇచ్చారు. జగన్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమీక్షిస్తానని చెప్పకనే చెప్పారు. మొత్తానికి అయితే గురువుకు పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా శిష్యుడు జగన్ కు గట్టిగానే హెచ్చరికలు పంపారు చంద్రబాబు.