Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని నోరు పారేసుకున్నారు. ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ ను చాలా తక్కువ చేసి మాట్లాడారు. తాను సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్ మాటమాత్రానికైనా శుభాకాంక్షలు తెలపలేదని.. కనీసం ఫోన్ చేసి అభినందించలేదని రేవంత్ వ్యాఖ్యనించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ గురించి ప్రస్తావించారు. దీనిపై తాజాగా స్పందించిన కొడాలి నాని హాట్ కామెంట్స్ చేయడం విశేషం.
ఇటీవల తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రేవంత్ సీఎం అయిన తర్వాత జగన్ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. కెసిఆర్ ను సీఎం జగన్ ప్రత్యేకంగా పరామర్శించారని.. ఆయనకు శస్త్ర చికిత్స జరిగిందని.. రేవంత్ కు అటువంటిది ఏమైనా జరిగిందా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమని.. అసలు రేవంత్ రెడ్డికి జగన్ ఎందుకు ఫోన్ చేయాలని ప్రశ్నించారు. రేవంత్ పక్క రాష్ట్ర సీఎం అని.. పట్టించుకునే సమయం లేదని తేల్చి చెప్పారు.
రేవంత్ కంటే జగన్ గొప్పవాడని చెప్పే ప్రయత్నం నాని చేశారు. అసలు రేవంత్ రెడ్డి ది ఏమైనా ప్రాంతీయ పార్టీయా? ఆయన ఏమైనా సుప్రీమా? ఆయనకు ప్రత్యేకంగా కలవాల్సిన పని ఏముందని ప్రశ్నించారు. ఏదైనా అవసరం ఉంటే నేరుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తో మాట్లాడితే సరిపోతుందని.. వారితో రేవంత్ రెడ్డికి చెప్పిస్తే చాలని నాని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి షర్మిల సపోర్ట్ చేస్తే తమకు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. అవసరమైతే తెలంగాణ సీఎం పోస్టుకు రాజీనామా చేసి ఏపీలో పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోవచ్చని కూడా కొడాలి నాని కామెంట్స్ చేయడం విశేషం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఇలా ఆయనను వ్యక్తిగతంగా ఏపీ నుంచి కామెంట్స్ చేసిన వారిలో కొడాలి నాని ముందు ఉండడం విశేషం. దీనిపై తెలంగాణ నుంచి ఏ స్థాయిలో రిప్లయ్ వస్తుందో చూడాలి.
రేవంత్ రెడ్డి ఏమి ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కాదు ఢిల్లీలో ఏం చెబితే అది చెయ్యాలి -కొడాలి నాని pic.twitter.com/uPI7pvcp4n
— Anitha Reddy (@Anithareddyatp) January 9, 2024