Save AP: అదొక్కటే ఏపీని కాపాడగలదు: పవన్ కల్యాణ్

That alone can save AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోనిప్రజా సమస్యలపై తన గళాన్ని గట్టిగా విన్పిస్తూనే ఉన్నారు. కౌలు రైతుల సమస్యను భుజాన వేసుకున్న పవన్ కల్యాణ్ జనసేన తరుపున వారికి అండగా నిలుస్తున్నారు. రైతుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి మృతిచెందిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయాల చొప్పున అందిస్తున్నారు. కౌలు రైతుల సమస్యను ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ జనసేనాని పలు జిల్లాల్లో కౌలు రైతు […]

Written By: NARESH, Updated On : July 3, 2022 8:31 pm
Follow us on

That alone can save AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోనిప్రజా సమస్యలపై తన గళాన్ని గట్టిగా విన్పిస్తూనే ఉన్నారు. కౌలు రైతుల సమస్యను భుజాన వేసుకున్న పవన్ కల్యాణ్ జనసేన తరుపున వారికి అండగా నిలుస్తున్నారు. రైతుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి మృతిచెందిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయాల చొప్పున అందిస్తున్నారు. కౌలు రైతుల సమస్యను ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ జనసేనాని పలు జిల్లాల్లో కౌలు రైతు యాత్ర చేపడుతున్నారు.

Pavan Kalyan

ఈ కార్యక్రమం ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పూర్తి చేసిన పవన్ కల్యాణ్ నేడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ సమస్యలను జనసేన దృష్టికి తీసుకొచ్చేలా జనవాణి కార్యక్రమాన్ని నేడు విజయవాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.

ఏపీలో వైసీపీ రాక్షస పాలన కొనసాగిస్తుందని ఇలాంటి చర్యలు రాష్ట్రానికి మంచిది కాదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. రాష్ట్రాన్ని బాగు చేయడం ఏ ఒక్కరి చేతిలో లేదన్నారు. ప్రతీ గ్రామంలో చిత్తశుద్ది ఉన్న కార్యకర్తలు పది మంది ఉండి, రాష్ట్రానికి బలమైన నేతల సామూహం ఉన్నప్పుడే సమస్యలతో ఏపీని గట్టెక్కించగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కలిసి కట్టుగా వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వెనిజులా, శ్రీలంక లాంటి దేశాల్లో విస్తృతమైన వనరులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ నాయకత్వ లోపంతో ఆ దేశాలు పేదదేశాలుగా మిగిలిపోయాయన్నారు. ఏపీలో వనరులు తక్కువగా ఉన్నప్పటికీ దోచేయడానికి మాత్రం లక్షల కోట్లు దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు.

సమర్థమైన నాయకత్వం లేకపోవడం వల్లేనే ఏపీ అప్పుల్లో కురుకపోతుందన్నారు. ఎన్నికల తాయిళాలతో నాయకులు ప్రజల్ని వైసీపీ మభ్యపెడుతున్నారు. ఒక పని చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలేసుకొని వైసీపీ పాలన చేస్తుందన్నారు. జనసేన మాత్రం ఒక పని చేస్తే ప్రజలు ఎంతో బాగుపడుతుందని మాత్రమే ఆలోచిస్తుందన్నారు.

ప్రజలు తన నుంచి అద్భుతాలు ఆశించవద్దన్నారు. తానేమీ సీఎంను కానని మీలానే సగటు మనిషిని అని గుర్తు చేశారు. ప్రజలు తమ సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తే వీలైనంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సమస్యలను పరిష్కరించాలనే హృదయం నాయకుడికి ఉండాలని అప్పుడే పరిష్కారం లభిస్తుందన్నారు.

ఇక అజాదీ అమృత్ మహోత్సవాల్లో భీమవరంలో అల్లూరి సీతరామరాజు 30అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరుగడం తెలుగువారికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి తనను కూడా ఆహ్వానించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 4న జరిగే ఈ కార్యక్రమానికి జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.