Telugu Popular Newspaper: తెలుగు సొసైటీ ఈనాడు కు చాలా ఇచ్చింది. అందువల్లే ఈ లార్జెస్ట్ సర్కులేటెడ్ తెలుగు డైలీ అనే ట్యాగ్ లైన్ ఈనాడుకు మాత్రమే సొంతం అయ్యేలా చేసింది. అందువల్లే ఈనాడు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. నేటి స్మార్ట్ కాలంలోనూ ఈనాడు పేపర్ ను ప్రజలు ఎందుకు చదువుతున్నారు అంటే.. కొంతలో కొంత భాషా పరిజ్ఞానం బాగుంటుందని.. వార్తల ఎంపికలో కచ్చితంగా ఉంటుందని.. న్యూట్రల్ జర్నలిజాన్ని కొనసాగిస్తుందని నమ్ముతుంటారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాలను క్రమేపీ దూరం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే రామోజీరావు బతికి ఉన్నప్పుడు.. తను యాక్టివ్ గా పేపర్ ను పరిశీలిస్తున్నప్పుడు.. ఈనాడులో అక్షర దోషాలు లేకుండా.. చూసుకునేవారు. అన్వయం కోల్పోయిన వార్తలు వెంటనే రౌండప్ చేసి జిల్లా బాధ్యులకు పంపించేవారు. పైగా క్వాలిటీ సెల్ ఆధ్వర్యంలో “దివిటి” ని రన్ చేసేవారు.. దీంతో ఈనాడు ఒక గ్రంథం లాగా.. తప్పులు లేని.. అక్షర దోషాలు లేని పుస్తకం లాగా ఉండేది. అందువల్లే తెలుగు మీడియాలో మకుటం లేని మహారాజు లాగా ఈనాడు వెలుగొందింది.
Also Read: Targets YCP Leaders : అష్టదిగ్బంధనం.. బెదిరిపోతున్న వైసీపీ నేతలు!
ఇప్పుడు పట్టించుకునే రామోజీరావు కాలం చేశారు. రామోజీరావు పెద్ద కుమారుడు ఈనాడు గ్రూపు సంస్థలకు చైర్మన్ గా ఉన్నారు. రామోజీరావు చరమాంకంలో ఉన్నప్పుడే ఈనాడు ఒక రకమైన నిర్లక్ష్యమైన దశలోకి వెళ్ళింది. ఇప్పుడు మరింత లోతుల్లోకి వెళ్తోంది. అక్షర దోషాలు మిగతా పత్రికల కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక అన్వయాలు అసలు కుదరడం లేదు. వార్తా రచన ఏ మాత్రం బాగుండడం లేదు. స్థూలంగా చెప్పాలంటే ఈనాడు పేపర్ ఒకప్పటిలాగా లేదు.. ప్రత్యేకమైన జర్నలిజం స్కూలు.. అద్భుతమైన లైబ్రరీ.. అత్యాధునిక టెక్నాలజీ.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈనాడు ఒకప్పటిలాగా పాఠకుల మనసుకు దగ్గర కాలేకపోతున్నది. వారి అభిమానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నది.
Also Read: Railway Employee Vinodh Sharma: నిజాయితీతో హీరోగా మారిన రైల్వే ఉద్యోగి.. హ్యాట్సాస్ పోర్టర్!
ఎన్ని అవరోధాలు ఉన్నా ఈనాడు నెంబర్ వన్ గానే ఉంటుంది. ఎందుకంటే దానికి సమీపంలో మిగతా పత్రికలు లేవు. ఒకవేళ ఉన్నా.. అవి ఈనాడును బీట్ చేయలేవు.. సాక్షికి ఇప్పుడు అంత సంపత్తి లేదు. ఆంధ్రజ్యోతికి ఈనాడు ను బీట్ చేసే అంత సీన్ లేదు ఏం ఇక నమస్తే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బహుశా ఈ ధైర్యం వల్లే కావచ్చు ఈనాడు సంపాదకీయ విభాగంలో పనిచేసే వారంతా నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తున్నారు. అక్షరానికి నఫిషీలు అద్ది.. అందంగా తీర్చి తీద్దాల్సిన చోట.. నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. పాఠకులు పైసలు పెట్టి కొనుక్కున్న కర్మానికి చదవక చస్తామా అన్నట్టుగా.. తిట్టుకుంటూ.. ఆ తప్పులను సవరించుకుంటూ.. చదివేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈనాడు తప్పులను కొంతమంది బట్ట బయలు చేస్తున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.