Targets YCP Leaders : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలకు కష్టాలు తప్పడం లేదు. కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గడిచిన మూడు నెలలుగా వల్లభనేని వంశీ మోహన్ జైల్లోనే ఉన్నారు. ఆయనను చూసిన తరువాత వివాదాలకు దూరంగా ఉండటమే మంచిదని చాలామంది వైసిపి నేతలు డిసైడ్ అయ్యారు. అటు కార్యకర్తలు ఫోన్ చేస్తుంటే చాలామంది నేతలకు సంబంధించి అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తోంది. దీంతో నేతలను నమ్ముకున్న కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. అనవసరంగా లేనిపోని రాజకీయాలు కొని తెచ్చుకున్నామని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి వ్యతిరేకంగా నోరు విప్పి బదులు సైలెంట్ గా ఉండడమే బెటరని అంటున్నారు కొందరు నేతలు. అందుకే చాలామంది నేతలు సైలెన్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు అయితే రాష్ట్రానికి దూరంగా ఉండిపోతున్నారు. వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక రకమైన భయం అయితే మాత్రం కనిపిస్తోంది.
* వంద రోజుల కిందట అరెస్టు..
సరిగ్గా 100 రోజుల కిందట వల్లభనేని వంశీ మోహన్( vallabhaneniVamsi Mohan ) అరెస్టయ్యారు. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు రెడీ అవుతోంది. తనకు ఆరోగ్యం బాగాలేదని.. చికిత్స తీసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఆయన విషయంలో ఎక్కడ సానుభూతి కనిపించడం లేదు. పైగా సోషల్ మీడియాలో నాడు వల్లభనేని వంశీ మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన తర్వాత గురుడుకు మంచిగతే పట్టిందన్న వారు ఎక్కువగా ఉంటున్నారు. చేసిన పాపాలే ఆయనను వెంటాడాయని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : గుమ్మం దాటని ఆ ముగ్గురు వైసీపీ సీనియర్లు!
* కొడాలి నాని పై ఫోకస్..
వల్లభనేని వంశీ పనైపోవడంతో ఇప్పుడు కొడాలి నాని( Kodali Nani ) పై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను గమనించిన కొడాలి నాని విదేశాలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎయిర్పోర్టులతోపాటు నౌకాశ్రయాలకు ఆన్లైన్ ద్వారా నోటీసులు పంపారు. ఇటీవల ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో గుండెకు సంబంధించి చికిత్స చేయించుకున్నారు కొడాలి నాని. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నారు. విజయవాడ వెళ్తే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. అమెరికాకు వైద్యం పేరిట వెళ్లాలని చూస్తున్న కొడాలి నాని కి చెక్ పడింది.
* మద్యం కుంభకోణంలో..
అయితే తాజాగా మద్యం కుంభకోణం( liquor scam ) విషయం పై మాట్లాడారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎటువంటి తప్పిదాలు జరగలేదని వచ్చారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారికి సైతం మద్యం కుంభకోణంతో అసలు సంబంధం లేదని తేల్చేశారు. ఇప్పుడు చూస్తుంటే వైద్యం కోసం విదేశాలకు వెళ్లాలని కొడాలి నాని భావిస్తుంటే.. ఏకంగా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిపోతున్నారు. కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండటమే మేలని భావిస్తున్నారు.