TDP Nominated Posts: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కూటమిలో చాలామంది నేతలు ఇంకా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల వరకు చాలామంది నేతలకు ఓకే చేశారు. అయితే వాటికి మించిన స్థాయి పదవులు ఆశిస్తున్న వారి విషయంలో మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద పెదవులు భర్తీ చేయడానికి ఆ సమయం రావాలి. ముఖ్యంగా రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవులను ఖాళీ అయినప్పుడు మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే 2026లో భారీ స్థాయిలో ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ ఖాళీలు ఏర్పడతాయి. తప్పకుండా అప్పుడు నేతలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారు, పార్టీకి ప్రచారం చేసిన వారు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లినవారు పదవులు ఆశిస్తున్నారు. వారికి ఒక క్రమ పద్ధతిలో పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
* సీనియర్ నేతల వెయిటింగ్..
సీనియర్ నేతల్లో ప్రధానంగా యనమల రామకృష్ణుడు( Ramakrishnudu), కేఈ కృష్ణమూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం వర్మ, బుద్ధ వెంకన్న వంటి నేతలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే అశోక్ గజపతి రాజుకు లైన్ క్లియర్ చేశారు. ఆయన హోదాకు తగ్గట్టు గవర్నర్ పదవి ఇప్పించారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు కు ఏదో ఒక పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన రాజ్యసభ పదవి కోరుకుంటున్నారు. ఒకసారి పెద్దల సభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. అంటే ఈ ఏడాదిలో ఆయనకు ఛాన్స్ వచ్చినట్టే. మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావుకు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం టికెట్ ను వదులుకున్నారు. తప్పనిసరిగా ఆయనకు ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజేంద్రప్రసాద్ సైతం పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపించారు. స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీని సజీవంగా నిలబెట్టారు. రాజేంద్రప్రసాద్ తో పాటు బుద్ధ వెంకన్న లాంటి నేతలు 2014లో ఎమ్మెల్సీ పదవులు అందుకున్నారు. వారికి ఇప్పుడు అవే పదవులు ఇవ్వాల్సి ఉంది. వంగవీటి రాధాకృష్ణతోపాటు పిఠాపురం వర్మ పార్టీ కోసం త్యాగాలు చేయడమే కాదు.. కూటమి పార్టీలకు మద్దతుగా ప్రచారం చేశారు. వారికి సైతం ఎమ్మెల్సీ పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంది.
* పదుల సంఖ్యలో పదవులు భర్తీ..
ఇప్పటివరకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల ఎంపిక జరిగింది. మూడు పార్టీలకు ప్రాధాన్యం దక్కింది. నేతలు నేతలు వారి స్థాయి బట్టి పదవులు కేటాయించారు. అయితే ఇప్పుడున్న మిగిలిన నేతలు అంతా రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారే. ప్రస్తుతం 30 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఉన్నారు. ఏడు రాజ్యసభ సీట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో 2028 వరకు ఇవన్నీ ఖాళీ కానున్నాయి. ఇప్పటికే ఓ ఐదు ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కానీ చైర్మన్ ఆమోదించలేదు. అయితే పదవీ విరమణ చెందిన వారి స్థానంలో తప్పకుండా కూటమికి లభిస్తాయి. వచ్చే ఏడాది ఓ మూడు రాజ్యసభ స్థానాలతో పాటు 10 వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే మొత్తం ఖాళీల భర్తీ జరగనుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న టిడిపి నేతలకు పదవులు లభిస్తాయి. ఆపై 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టులు సైతం కొందరికి ఇచ్చే అవకాశం ఉంది. అలా వారందరినీ సర్దుబాటు చేస్తారు చంద్రబాబు. ఒక విధంగా చెప్పాలంటే 2026 పదవుల జాతర అని చెప్పవచ్చు.