Aamir Khan: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువ…కొంతమందికి మాత్రమే ఇక్కడ సక్సెస్ లు దక్కుతాయి. వాళ్లు మాత్రమే వాళ్లు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు. ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు వరుసగా 12 విజయాలతో 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక అలాంటి రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేస్తే వాళ్లకు ఒక గొప్ప ఐడెంటిటి వస్తుందని ప్రతి నటుడు భావిస్తున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ సైతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక హీరోగా కాకపోయినా కనీసం విలన్ పాత్ర ఇచ్చిన కానీ ఆయన చేస్తానని ఓపెన్ గా చెబుతున్నాడు.
అయినప్పటికి రాజమౌళి మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. కారణం ఏంటి అంటే ఇంతకు ముందు రాజమౌళి ఒక సినిమా చేయడానికి అమీర్ ఖాన్ ను అడిగినప్పుడు అతను రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేశాడు. దాంతో రాజమౌళి అంటే ఏంటో చూపిస్తాను అనుకున్న రాజమౌళి వరుస సక్సెస్ లతో ఇండియాను షేక్ చేశాడు.
ఇక అప్పుడు అమీర్ ఖాన్ ను పిలిచి మరి రాజమౌళి మనం ఒక సినిమా చేద్దామని చెప్పినప్పటికి రాజమౌళి మాత్రం ప్రస్తుతం నాకు కమిట్మెంట్స్ ఉన్నాయని అవన్నీ పూర్తయిన తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాడట. దాంతో అమీర్ ఖాన్ ఏం చేయాలో అర్థం కాక రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని ఏ క్యారెక్టర్ ఉన్నా సరే చేస్తాను అని ఓపెన్ గా చెబుతున్నాడు…
నిజానికి ఒకప్పుడు బాలీవుడ్ వాళ్లు మనల్ని చీమల్ని చూసినట్టు చూసేవారు అయినప్పటికి మన వాళ్లు మాత్రం వాళ్ళ దగ్గర అనిగిమనిగి ఉంటూ వచ్చారు. మొత్తానికైతే మనకు స్టార్ డమ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరికీ లొంగాల్సిన పరిస్థితి లేదని ప్రతి ఒక్క తెలుగు హీరో, దర్శకుడు చాలా గర్వంగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు… అమీర్ ఖాన్ అనుకున్నట్టుగానే రాజమౌళి సినిమాలో ఏదైనా ఒక అవకాశం ఇస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…