Kesineni Chinni Vs Kolikapudi: మరోసారి తిరువూరు( thiruvuru ) టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి వార్తల్లో నిలిచారు. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన ఈరోజు బాంబు పేల్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ పై సంచలన ఆరోపణలు చేశారు. 2024 శాసనసభ ఎన్నికల్లో టిడిపి టికెట్ కోసం కేశినేని శివనాథ్ తనను ఐదు కోట్ల రూపాయలు అడిగారని.. తాను మూడుసార్లు అకౌంట్ నుంచి ఆయనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపించారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి టికెట్ దక్కించుకున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నారు. తనపై వివాదాస్పద ముద్ర వేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఏకంగా సొంత పార్టీ ఎంపీపై సంచలన కామెంట్స్ చేశారు. ఇది పెను దుమారానికి దారితీసింది.
గత కొద్ది రోజులుగా విభేదాలు..
గత కొద్ది రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో( Kesineni Chinni ) కొలిక పూడి శ్రీనివాసరావుకు విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి తారాస్థాయికి చేరడంతోనే ఆయన ఈ సంచలన అంశాలను బయటపెట్టినట్లు సమాచారం.’ 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 8న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు, పోరంకిలో కేశినేని పిఏ మోహన్ వచ్చి తీసుకెళ్లిన రూ.50 లక్షలు, గొల్లపూడి లోని తన స్నేహితుడు రూ.3.5 కోట్లు గురించి రేపు మాట్లాడుకుందాం. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. అకౌంట్ నుంచి మూడుసార్లు బదిలీ చేసిన 60 లక్షల రూపాయలు వివరాలు ఇవేనంటూ ఆయన బాంబు పేల్చారు.
రేపు హై కమాండ్ ఎదుట ఇద్దరు..
గత కొద్ది రోజులుగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా నియోజకవర్గంలో వర్గ పోరుకు ఎంపీ చిన్ని కారణమని ఆయన అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని.. లిక్కర్ కేసులలో ఉన్న కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన సొమ్ముతో కాదంటూ ఆయన వరుసగా పోస్టులు పెట్టడం టిడిపిలో చర్చకు దారి తీసింది. అమరావతి ఉద్యమ రైతుగా శ్రీనివాసరావు ఉండేవారు. కానీ ఆయనకు అనూహ్యంగా తిరువూరు నుంచి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా గెలిచారు కానీ తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కాగా కొలికపూడి ఆరోపణలపై స్పందించారు ఎంపీ కేసినేని చిన్ని. ఆయన ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని.. తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తేల్చి చెప్పారు. నా జేబులో డబ్బులే ఖర్చు పెడతానని అన్నారు. తానేంటో ప్రజలకు తెలుసునని అన్నారు చిన్ని. ఐదు, పది లక్షల కు ఆశ పడే మనస్తత్వం నాది కాదు అని.. ఆయన గురించి హై కమాండ్ చూసుకుంటుందని తేల్చి చెప్పారు. మరోవైపు టిడిపి హాయ్ కమాండ్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే తో పాటు ఎంపీ రేపు అధిష్టానం ముందు హాజరుకావాలని సమాచారం ఇచ్చింది. గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై హై కమాన్ ఆగ్రహంగా ఉంది. తిరువూరు బాధ్యతలను ఎంపీ చిన్నికి అప్పగించింది. ఒకటి రెండుసార్లు ఎమ్మెల్యే శ్రీనివాసరావును చంద్రబాబు పిలిచి మాట్లాడారు. ఇప్పుడు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తుండడంతో కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?