Sharmila Son Raja Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఒక పరిణామం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి రూపంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఎక్కువమంది భావిస్తున్నారు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లిన తీరు, అటు తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి డామేజ్ చేయడం వంటివి ఎక్కువ మంది గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా షర్మిల విషయంలో టిడిపి అనుకూల మీడియా వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆయనను వెంటాడింది ఆంధ్రజ్యోతి. అటువంటి ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూలు ఇచ్చారు షర్మిల. షర్మిల మధ్యలో ఉన్న ప్రతి అభిప్రాయం ఆంధ్రజ్యోతిలో వచ్చేది. అటు తర్వాత అలా వచ్చిన వార్తలను ఆచరణలో పెట్టేవారు షర్మిల. అయితే ఇప్పుడు కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ వెనుక చంద్రబాబుతో పాటు టిడిపి అనుకూల మీడియా ఉందన్నది ఒక అనుమానం.
* పతాక శీర్షికన వార్తలు.. కర్నూలులో( Kurnool ) ఉల్లి రైతుల పరామర్శకు వెళ్లారు షర్మిల. ఆ సమయంలో ఆమె వెనుక కుమారుడు రాజారెడ్డి కూడా వచ్చాడు. అంతకుముందే అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ పక్కా అన్న ప్రచారం ప్రారంభం అయింది. టిడిపి అనుకూల మీడియాలో డిబేట్లు నడిచాయి. ఆ తరువాత షర్మిల, ఆమె పత్రికల్లో పతాక శీర్షికన హైలెట్ అయ్యారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని అనుమానించడం ప్రారంభించారు. టిడిపి అనుకూల మీడియా వ్యవహార శైలి గమనించి.. షర్మిల పొలిటికల్ ఎంట్రీ సమయంలోనే ఇదే మాదిరిగా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. కచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలను అంచనా వేసుకుని రాజారెడ్డిని తెరపైకి తెచ్చారన్న అనుమానం సగటు వైసీపీ శ్రేణుల్లో ఉంది.
* మారుతున్న ప్రాధాన్యతలు..
ఇటీవల టిడిపి( Telugu Desam) అనుకూల మీడియాలో షర్మిల విషయంలో రాతలు మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కానీ.. జగన్మోహన్ రెడ్డి పై కానీ ఆమె ఆరోపణలు చేస్తే.. సంచలన అంశాలుగా పరిగణించి మొదటి పేజీలో పతాక శీర్షికన వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్ లు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే లోపలి పేజీల్లో ఎక్కడో మారుమూల.. చిన్నపాటి వార్తతో సరిపెడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన షర్మిల నిత్యం సంచలన కామెంట్స్ చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. మొన్న ఆ మధ్యన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి వైసిపి ఎంపీలు మద్దతు తెలపడాన్ని తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి పై చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కూడా షర్మిల టిడిపి అనుకూల మీడియాలో హైలెట్ అయ్యారు. ఇప్పుడు తన కొడుకు రాజారెడ్డి విషయంలో సైతం అనుకూల మీడియా కవరేజ్ భారీగా ఉండనుంది. నిజంగా ఈ విషయంలో షర్మిల విజయం సాధించినట్టే.