TDP Mahanadu Food Menu: మహానాడుకు( mahanadu) ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ మహానాడు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా మహానాడు ను నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మహానాడు అంటే నేతలతో పాటు కార్యకర్తలకు ఎంతో ప్రీతి. దానికి కారణం లేకపోలేదు. ఆహారం మెనూ అక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. మనసుకు నచ్చే, రుచికరమైన ఆహారాన్ని మూడు రోజులపాటు అందుబాటులోకి ఉంచుతారు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ మహానాడు జరిగినా పార్టీ శ్రేణులు వెళ్లేందుకు ఇష్టపడతాయి. ఈసారి కూడా మహానాడులో ఆహారం మెనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఆ వంటకాలు సైతం వైరల్ అయ్యాయి. మహానాడులో పసందైన ఆహారం అంటూ తెగ ప్రచారం జరిగింది.
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
కడపలో( Kadapa ) రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. పార్టీలో సీనియర్ నాయకులు, మంత్రులు నగరంలో మకాం వేశారు. రోజుకు 40,000 మందికి 22 రకాల తో అల్పాహారం, శాఖాహారం భోజనాలు వడ్డించనున్నారు. ఇందుకోసం 1500 మంది వంట సిబ్బంది రంగంలోకి దిగారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు నగరంతో పాటు శివారు, సమీప పట్టణాల్లో కూడా వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కమలాపురం నియోజకవర్గం సీకే దీన్నే మండలం చెర్లోపల్లి- పబ్బాపురం గ్రామాల మధ్య 250 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు ఏర్పాట్లు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, కార్యవర్గ సభ్యులు కూర్చునే వేదికతో పాటు ప్రతినిధుల కోసం కలిపి ఒక షెడ్ ఏర్పాటు చేశారు. అల్పాహారం, భోజనం, విశ్రాంతి, మంచినీరు, వైద్య బృందాలకు ప్రాంగణంలోని వేరువేరుగా ప్రత్యేక వసతులతో ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: Road Accident: తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
* మహానాడు ప్రాంగణంలో ఆరు ఫుడ్ కోర్టులు( food courts ) ఏర్పాటు చేస్తున్నారు. ప్రతినిధులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలోనే నాయకులకు టోకెన్లు జారీ చేస్తారు. ఆటో కెన్ లతో నచ్చిన ఫుడ్ కోర్ట్ లో కోరిన ఆహార పదార్థాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర వంటకాలతో పాటు రాయలసీమ రుచులతో వంటకాలు వడ్డించనున్నారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, వడ, పొంగల్, విభిన్న రుచులతో చట్నీలు, సాంబార్, కారం పొడి, నెయ్యి వడ్డించనున్నారు. టీతో పాటు కాఫీ కూడా అందిస్తారు.
* మధ్యాహ్నం భోజనం కింద కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జి, బగారా రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్, పుల్కా లేదా చపాతి, సొరకాయ పప్పు, చట్నీ, కారంపొడి, తెల్ల అన్నం అందిస్తారు. కూరలకు సంబంధించి భోజనం లోకి జీడిపప్పుతో కలిపిన టమాట ములక్కాయ, అప్పడాలు, గుత్తి వంకాయ, ఉలవచారు, రసం, పెరుగు, కేక్, కూల్ డ్రింక్ తో పాటు పాన్ అందుబాటులో ఉంచుతారు. కాజు చికెన్ కర్రీ, ఎగ్ మసాలా తో కూడిన 22 రకాల వంటకాలు వడ్డించనున్నారు.
* మహానాడుకు విజయవాడకు చెందిన ప్రముఖ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ప్రతినిధికి కాంట్రాక్టు అప్పగించినట్లు తెలుస్తోంది. 2023 రాజమండ్రిలో నిర్వహించిన టిడిపి మహానాడుకు అంబికా క్యాటరింగ్ ప్రతినిధులకు అప్పట్లో బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో 50 వేల మందికి రుచికరమైన ఆహారాన్ని అందించారు. మరోవైపు ఫుడ్ కోర్ట్ వద్ద 10 లక్షల వాటర్ బాటిళ్లు, మరో 10 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులోకి ఉంచారు.
* మహానాడుకు హాజరయ్యే వారికి కడప నగరంలో వసతి సరిపోవటం లేదు. దీంతో సమీపంలోని మైదకూరు, ప్రొద్దుటూరు, పులివెందులతో సహా చాలా గ్రామాల్లో నాయకులకు వసతి ఏర్పాటు చేస్తున్నారు.