AP Government: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. వచ్చిన వెంటనే తన టీంను ఏర్పాటు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులను మార్చారు. కీలక స్థానాల్లో తనకు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇచ్చారు. మరికొందరి విషయంలో మాత్రం మొండి చేయి చూపారు. అయితే ఇలా మొండి చేయి చూపిన వారంతా వైసిపి హయాంలో కీలకమైన అధికారులే. ముఖ్యంగా గత ఐదేళ్లలో దూకుడుగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టారు. అప్పట్లో టిడిపి తో పాటు జనసేన ను వేధించిన అధికారులను లూప్ హోల్స్ లోకి పంపించారు. అటువంటి వారి జాబితాలో సీనియర్ ఐఏఎస్ లు శ్రీలక్ష్మి, ముత్యాల రాజు లాంటి వారు ఉన్నారు. మురళీధర్ రెడ్డి, మాధవి లత, నీలకంఠారెడ్డి వంటి వారు ఈ కోవలోకి వస్తారు. ఐపీఎస్ అధికారుల విషయానికొస్తే కొల్లి రఘురామిరెడ్డి, నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, ఎన్ సంజయ్, పీవీ సునీల్ కుమార్, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని వంటి వారు ఉన్నారు.
* నెలలు గడుస్తున్నా
అయితే నెలలు గడుస్తున్నా ఇటువంటి అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు చంద్రబాబు సర్కార్( Chandrababu Sarkar). తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. గతంలో వివిధ కారణాలతో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ లకు పోస్టింగ్స్ లభించినా.. వైసిపి అస్మదీయ అధికారులను మాత్రం అలానే ఉంచేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. వీరంతా సీనియారిటీ జాబితాలో ఉన్నవారే. రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న వారే. కేవలం అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు వీరిని వాడుకోవడంతో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వీరంతా టార్గెట్ అయ్యారు. పోస్టింగులు లేకుండా చేసుకున్నారు.
* అధికారుల మార్పు సాధారణం
ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కీలకమైన అధికారుల మార్పులు సర్వసాధారణం. అయితే ఈసారి చాలామంది సీనియర్ అధికారులకు( senior officers) పోస్టింగ్ లేకుండా పోయింది. అఖిలభారత సర్వీస్ అధికారులను ఒకేసారి పోస్టింగ్స్ ఇవ్వకుండా దూరం పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఇదే అధికారులు గతంలో వ్యవహరించిన తీరుతోనే ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ఈ విషయంలో ఎవరిని సమర్థించలేము. ఎవరిని తప్పు పట్టలేం కూడా.
* కొందరు అధికారుల తీరుతో
మనదేశంలో పేరుకే బ్యూరోక్రాసి వ్యవస్థ( Bureaucracy system). ప్రభుత్వ ఆదేశాలను పాటించడం అధికారుల ప్రధానమైన విధిగా మారిపోయింది. ఒకవేళ వ్యతిరేకిస్తే పరిణామాలు మరోలా ఉంటాయి. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది నేతలు ఆ పార్టీ మనుషుల్లా ప్రవర్తించారు. ప్రత్యర్థులను రాజకీయంగా వేధించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన శ్రేణులను వెంటాడారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.