Deputy CM Pawan Kalyan : పవన్ సనాతన ధర్మ డిక్లరేషన్ వెనుక బిజెపి హస్తము ఉందా? బిజెపి వ్యూహకర్తల సలహాతోనే అలా చేశారా? తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? సనాతన ధర్మ ప్రచార సభకు తిరుపతిలో ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ.గత కొద్దిరోజులుగా తిరుపతి లడ్డు వివాదం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు పవన్.సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రాయశ్చిత్త దీక్షకు కూడా దిగారు. 11 రోజులు పాటు దీక్ష చేసి చివరి రోజు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ మాటలు చూస్తుంటే పూర్తి సనాతన వాదిగా మారిపోయినట్టు కనిపించారు. కొత్త రకం కాషాయ దళం కు చేరువైనట్లు స్పష్టమవుతోంది. దీంతో పవన్ వెనుక బిజెపి వ్యూహం ఉందా అన్న అనుమానాలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. కచ్చితంగా బిజెపి రాజకీయ వ్యూహంలో భాగంగానే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
* అందుకే ఆ వ్యాఖ్యలు చేశారా
సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిదని.. ఈ మహమ్మారిని నిర్మూలించాలంటూ ఆమధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిది కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ నేతల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. పరిస్థితి గమనించిన పవన్ ఆ విషయాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారన్నది స్పష్టమవుతుంది. సనాతన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరని.. దాన్ని నిర్మూలించాలంటే వారే తుడిచిపెట్టుకొని పోతారని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ మాటను తిరుపతి బాలాజీ సాక్షిగా చెబుతున్నానని కూడా వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా ఈ మాటలను ఇంగ్లీష్, తమిళంలో పవన్ ప్రస్తావించడం విశేషం.
* తమిళనాడు ఎన్నికల కోసమేనా?
అయితే తమిళనాడు ఎన్నికల కోసమే పవన్ కళ్యాణ్ తో బిజెపి ఈ మాటలు అనిపించిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ హిందూ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నాయకులు లేరని బిజెపి హై కమాండ్ ఆలోచన. ఈ నేపథ్యంలోనే పవన్ రూపంలో ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ సనాతన ధర్మం కామెంట్స్ పై తమిళ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
&
ఎవడో తమిళ్లోడికి, గుణపం దింపాడు.
AP Deputy CM @PawanKalyan garu. pic.twitter.com/eLB9oRw7CA
— JanaSena Samhitha (@JSPSamhitha) October 3, 2024
;
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tamil nadu deputy cm udayani targets pawan kalyan for saying sanatana dharma is like a virus
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com