TTD: 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ఘోరంగా ఓడిపోయింది. అప్పట్లో టిడిపి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఒక పరిణామం. తిరుమలలో ఎప్పటినుంచో ఉన్న పింక్ డైమండ్ ను మాయం చేశారు అంటూ అప్పటి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానిని ఒక ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్లింది. అప్పట్లో టిడిపి నేతలే మాయం చేశారు అన్నట్టు ప్రచారం చేయడంలో విజయవంతం అయింది. దాని ప్రభావం ఎన్నికల ఫలితాల్లోనూ స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు అదే పింక్ డైమండ్ పై ఫుల్ క్లారిటీ వచ్చింది. దాని విషయమై తాజాగా ఒక వాస్తవం బయటపడింది.
* ఆర్కియాలజీ విభాగం ఫుల్ క్లారిటీ..
తిరుమల పింక్ డైమండ్( pink diamond) పై రకరకాల చర్చ ప్రారంభం కావడంతో.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ డైమండ్ పై అధ్యయనం చేసింది. అయితే ఇది పింక్ డైమండ్ కాదని.. కేవలం కెంపు మాత్రమేనని తేల్చి చెప్పింది. దీంతో ఇది సంచల మాంసం గా మారింది. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహుకరించింది ఈ డైమండ్. అటువంటి అత్యంత విలువైన డైమండ్ ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణా దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. దీనిపై లోతైన దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇది డైమండ్ కాదని.. కేవలం కెంపు అని తేల్చింది. ఈ అధ్యయనం వివరాలను సంబంధిత ఆర్కియాలజికల్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి బయటపెట్టారు. పాము అధ్యయనం చేసిన ప్రకారం అది పింక్ డైమండ్ కాదని ప్రకటించారు.
* మైసూర్ మహారాజా బహుమానం..
పింక్ డైమండ్ గా భావిస్తున్న ఈ కెంపును 1945 జనవరి 9న అప్పటి మైసూరు మహారాజు( Mysore Maharaja) జయ చామ రాజేంద్ర వడియార్ ఇచ్చినట్లు గుర్తించారు. ఆయన తన బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారు. అయితే మైసూర్ ప్యాలెస్ రికార్డుల్లో ప్రకారం అందులో కెంపులు.. మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని.. పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని.. కెంపులతోపాటు మరికొన్ని రత్నాల ప్రస్తావన మాత్రమే ఉందని.. పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం రెడ్డి స్పష్టం చేయడం విశేషం. ఇప్పుడు ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నాడు టిడిపి ప్రభుత్వం పై వైసీపీ చేసిన ప్రచారంలో నిజం లేదని తెలిసిపోయింది.