Stalin NDA Entry: రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. ఎవరికి ఎవరు శత్రువులో.. ఎవరు మిత్రులో కూడా అంచనా వేయలేం. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒక్క ఏపీ తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని అనుబంధ ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే దక్షిణాదిన మరింత పట్టు బిగించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అయితే ఏపీలో మాత్రం టిడిపి కూటమి అధికారంలో ఉంది. కర్ణాటకలో విజయ్ నేతృత్వంలోని టీవీ కి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల వరకు డీఎంకేతో స్నేహాన్ని కొనసాగించారు జగన్. కానీ ఎప్పుడైతే విజయ్ గెలిచారో.. వైసీపీ నేతలు రూటు మార్చారు. జగన్ సైతం స్టాలిన్ కంటే విజయ్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. జాతీయస్థాయిలో ఎన్డీఏ స్టాండ్ తీసుకున్న టిడిపి స్టాలిన్ తో పాటు విజయ్ ను సైతం రాజకీయ ప్రత్యర్థి గా చూసింది.
* మారిన బిజెపి వైఖరి..
అయితే స్టాలిన్ విషయంలో బిజెపి వైఖరి మారినట్లు తెలుస్తోంది. స్టాలిన్ సైతం ముస్లిం లీగ్ పార్టీని విడిచిపెట్టి ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే కాంగ్రెస్ డీఎంకేకు దూరమైంది. తద్వారా బిజెపికి వ్యతిరేకం అన్న అంశాన్ని దాటి బయటకు వచ్చేసింది డిఎంకె. మారిన పరిస్థితుల నేపథ్యంలో విజయ్ బలపడకుండా ఉండాలి అంటే ఎన్డీఏలో చేరడం శ్రేయస్కరమని స్టాలిన్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి బిజెపి నుంచి తనకు ఇబ్బంది రాకుండా చూసుకోవడంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. తమిళనాడు రాజకీయాలు తనకు ఇబ్బందికరంగా మారితే స్టాలిన్ ఎన్డీఏ గూటికి చేరుకునే అవకాశం ఉంది.
* డీఎంకే ప్రభుత్వం పై ప్రశంసలు
మరోవైపు స్టాలిన్ కోసం కేంద్ర ప్రభుత్వం లోకేష్ ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ ను విడిచిపెట్టి విజయ్ తో స్నేహం చేస్తున్నారు. అయితే జగన్ కోసం చంద్రబాబుతో ఉన్న మంచి సంబంధాలను వదులుకున్నారు స్టాలిన్. అందుకే లోకేష్ ద్వారా ఎన్డీఏలో చేరేందుకు స్టాలిన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ఢిల్లీలో జరిగిన ఓ కాంక్లేవ్ లో అప్పటి డిఎంకె ప్రభుత్వాన్ని పొగిడారు. స్టాలిన్ సర్కార్ విధానాలను ప్రశంసించారు. పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో తమిళనాడు ప్రభుత్వం ఏపీతో పోటీపడేదని.. ఈ క్రమంలో పారదర్శకంగా డీఎంకే ప్రభుత్వం వ్యవహరించేదని.. ఈ విషయాన్ని స్వయంగా పారిశ్రామిక వేత్తలే చెప్పారని ప్రకటించారు లోకేష్ . తద్వారా స్టాలిన్ ను ఎన్డీఏలోకి తెచ్చేందుకు లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం ప్రారంభమైంది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.
