https://oktelugu.com/

Sri Reddy : శ్రీరెడ్డి మళ్లీ బరస్ట్‌ అయింది!

ఇక జగన్‌పై దాడి గురించి టీడీపీ నేతలు వేస్తున్న సెటైర్లపై కూడా కౌంటర్‌ ఇచ్చారు. మీ అంత నటులు ఎవరూ కాదన్నారు. ప్రాణం పోతుందని తెలిసి దాడి చేసుకుంటాడా అని ప్రశ్నించింది. తన బాధను కూడా ఇప్పుడు నటనే అంటారు అని కూడా విమర్శించారు. ఇంత చండాలం ఎందుకురా చంద్రబాబు.. ఇంత చండాలం ఏంట్రా పప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2024 4:52 pm
    Sri Reddy

    Sri Reddy

    Follow us on

    Sri Reddy : శ్రీరెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు. మాలో సభ్యత్వం కోసం ఆఫీస్‌ ఎదుట అప్పట్లో అర్ధనగ్నంగా బైఠాయించి సంచలనం రేపింది. ఇక సెక్స్‌ సింబల్‌గా చాలా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వేదికగా నిత్యం తన వీడియోలు, ఫొటోలు, రీల్స్‌ షేర్‌ చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. శ్రీరెడ్డి మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. పార్టీలో పనిచేయకపోయినా జగన్‌ వీరాభిమానిగా తనను తాను ప్రమోట్‌ చేసుకుంటూంది. ఈ క్రమంలో జగన్‌ను ఎవరు ఏమైనా వారిపై వెంటనే ఫైర్‌ అవుతుంది. ఈ క్రమంలో గతంలో పలుమార్లు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తోపాటు, టీడీపీ నేతలపైనా మండిపడింది. తాజాగా జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విజయవాడకు చేరుకున్న తర్వాత అతనిపై రాయితో దాడి జరిగింది. ఈ ఘటనపై మరోమారో శ్రీరెడ్డి ఎమోషన్‌ అయింది.

    టీడీపీ నేతలను ఏకి పడేసి..
    ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై జడిగిన దాడిని ఖండిస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ఖతాలో పోస్టు చేసింది. ఇందులో టీడీపీ నేతలను ఏకిపారేసింది. ‘మీరు మనుషులా.. ఒక మనిషి ప్రాణం తీయడానికి కూడా తెగిస్తారా.. పదవుల కోసం జగనన్నకి ఇంత హాని తలపెడతారా.. ఒరేయ్‌ బోండాగా.. జగనన్న అంటే ఎంత మందికి ప్రాణమో తెలుసా.. జగనన్న కోసమే ఎంతో మంది బతుకుతున్నారు. ఐ లవ్‌ జగనన్న’ అంటూ కంటతడి ఎట్టుకున్నారు.

    మీ అంత నటన ఎవరికీ రాదు..
    ఇక జగన్‌పై దాడి గురించి టీడీపీ నేతలు వేస్తున్న సెటైర్లపై కూడా కౌంటర్‌ ఇచ్చారు. మీ అంత నటులు ఎవరూ కాదన్నారు. ప్రాణం పోతుందని తెలిసి దాడి చేసుకుంటాడా అని ప్రశ్నించింది. తన బాధను కూడా ఇప్పుడు నటనే అంటారు అని కూడా విమర్శించారు. ఇంత చండాలం ఎందుకురా చంద్రబాబు.. ఇంత చండాలం ఏంట్రా పప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ప్రజాదరణ ఓర్వలేకనే..
    జనన్నకు ప్రజల్లో వస్తున్న ఆదరణ, ఆయన తలపెట్టిన బస్సు యాత్రకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలా చేస్తోందని ఆరోపించింది. జగన్‌కు ఏమైనా అయితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చింది శ్రీరెడ్డి. టీడీపీ అంటేనే హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ అని ఆరోపించింది. రాజకీయాల్లో గెలవడం కోసం కొట్లాడాలని సూచించింది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. జగనన్న మంచి మనస్ను నాయకుడు అని తెలిపింది.