AP Alliance Govt Split: ఏపీలో( Andhra Pradesh) నకిలీ మద్యం ప్రకంపనలు సృష్టించింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం శిబిరం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ అధికారుల తనిఖీలో బయటపడింది. ఈ నకిలీ మద్యం తయారీలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి పై పార్టీ వేటు వేసింది. మరో నేతపై కూడా టిడిపి హై కమాండ్ చర్యలు తీసుకుంది. అయితే దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. అయితే నకిలీ మద్యం పై ఆరోపణలు వచ్చిన వెంటనే తాము చర్యలు తీసుకున్నామని.. ఈ నిందితులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముందస్తు ఒప్పందం కుదిరింది అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేస్తోంది. అయితే దీనిపై కేవలం టిడిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బిజెపితో పాటు జనసేన నేతలు స్పందించకపోవడం కూటమిలో ఉన్న గ్యాప్ ను తెలియజేస్తోంది.
* ప్రారంభంలో పర్వాలేదు..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే నడిచింది. ఇది ఉమ్మడి ప్రభుత్వం కావడంతో ఏ పార్టీపై రాజకీయంగా విమర్శలు వచ్చినా.. తిప్పి కొట్టాల్సిన అవసరం మూడు పార్టీలపై ఉంది. గతంలో చాలా పరిణామాల విషయంలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాయి. కానీ ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో మాత్రం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దానిని అడ్డుకోవడంలో కేవలం తెలుగుదేశం మాత్రమే ముందుంటోంది. ఈ విషయంలో బిజెపితో పాటు జనసేన నేతలు పెద్దగా కలుగజేసుకోవడం లేదు. దీనిని ఛాన్స్ గా తీసుకుంటోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదే పనిగా టిడిపి పై వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
* ఇలా అయితే కష్టమే..
కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) బలంగా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కూటమిలో తాము ఉన్నామన్న విషయాన్ని మూడు పార్టీలు మరిచిపోతున్నాయి. ఆ పార్టీపై ఆరోపణలు వచ్చాయి కదా.. తామెందుకు స్పందించాలన్న రీతిలో జనసేనతో పాటు బిజెపి నేతలు ఉన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో టిడిపి నేతల పేర్లు బయటకు వచ్చాయి. వారిపై చర్యలు తీసుకుంది పార్టీ నాయకత్వం. గత వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు భిన్నంగా చంద్రబాబు ముందుగానే చర్యలకు ఉపక్రమించారు. కానీ ఎందుకో ఈ విషయంలో జనసేనతో పాటు బిజెపి నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. ఇలానే ముందుకు సాగితే కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు రావడం ఖాయం.