Vallabhaneni Vamsi Case
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ మోహన్( Vallabhaneni Vamsi Mohan) విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. ఇప్పట్లోగా వంశీ మోహన్ జైలు నుంచి బయటకు వచ్చే మార్గం కనిపించడం లేదు. ఆయన చుట్టూ భారీగా ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు భారీగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన అనుచరుల దందాలను తవ్వి తీసేందుకు ఐజి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్పీలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది ప్రభుత్వం. మరోవైపు వంశీ తమను ఇబ్బంది పెట్టారని చాలామంది ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. వరుస కేసులు నమోదు చేసి వల్లభనేని వంశీకి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
* రూ.195 కోట్ల ప్రజాధనం..
ప్రధానంగా గన్నవరం( Gannavaram) నియోజకవర్గంలో మట్టి, ఇసుక, మైనింగ్ ద్వారా ఆయన అనుచరులు రూ.195 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం దర్యాప్తు కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పక్కా ఆధారాలు సేకరించి వల్లభనేని వంశీని అన్ని విధాల ఇరికించాలని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై వంశీ మోహన్ అనుచితంగా మాట్లాడారు. చివరకు నారా భువనేశ్వరి పై సైతం హాట్ కామెంట్స్ చేశారు. అందుకే అధికారం దెబ్బ ఎలా ఉంటుందో చూపించాలని కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
* ఇష్టారాజ్యంగా మైనింగ్
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ కృష్ణాజిల్లాలో ఇష్టారాజ్యంగా మైనింగ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. కొండలను గుల్ల చేశారని విజిలెన్స్ నివేదిక సమర్పించింది. కేవలం పానకాల చెరువు నుంచి రూ.100 కోట్ల విలువైన మట్టిని తవ్వించారని నివేదికలో స్పష్టం చేసింది. అప్పట్లో చాలామందిని బెదిరింపులకు దిగారని, అరాచకాలు సృష్టించారని తాజాగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
* కేసులతో ఉక్కు పాదం
ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో( Gannavaram constitution) భూ కబ్జాలకు సైతం పాల్పడ్డారని వల్లభనేని వంశీ పై అభియోగాలు ఉన్నాయి. తాజాగా 10 కోట్ల రూపాయల విలువైన భూకబ్జాపై ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు, ఇంకోవైపు కబ్జా ఆరోపణలతో ఫిర్యాదులు వస్తుండడంతో.. వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది.