YCP Social Media: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియా.. ఆ పార్టీకి మైనస్.. ప్లస్ అన్నది తెలియడం లేదు. అయితే ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అన్నది ఒక వాదన. వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ సమయంలో సోషల్ మీడియా బాగానే పనిచేసేది. 2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కూడా ఎంతగానో దోహదపడింది. కానీ 2019 నుంచి 2024 మధ్య ఆ పార్టీ సోషల్ మీడియా చర్యలు ఎంత మాత్రం ఉపయోగపడకపోగా.. ఆ పార్టీని మైనస్ కు గురిచేసాయి. ఆ పార్టీ విధానాలను, ప్రభుత్వ చర్యలను వివరించకుండా ప్రత్యర్థులను వెంటాడడం ప్రారంభించాయి. కనీసం వైఫల్యాలను, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు.
Also Read: ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో కోర్టుకు ఏపీ ప్రభుత్వం!
* లోకేష్ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర కోసమే సోషల్ మీడియాలో భారీగా రిక్రూట్మెంట్ చేశారు. లోకేష్ ఎక్కడ మాటలు దొర్లుతారా? ఆయనను ప్రజల రూపంలో ఎక్కడ వైసిపి అడ్డుకుంటుందా? దానిని ఎలా హైలెట్ చేద్దామా? అనే ఆలోచనలో ఉండిపోయారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు.
* సాధారణంగా ఒక్కసారి సోషల్ మీడియాలో కనిపిస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు నేటిజెన్లు. అటువంటిది ఎన్నో రకాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని హైలైట్ చేసేందుకు, ప్రత్యర్థులను తూలనాడేందుకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వినియోగించారు. వారిని ప్రజలు ఇట్టే గుర్తించారు.
* మొన్న అధికారం కోల్పోయిన తర్వాత జగన్ వల్లభనేని వంశీ మోహన్ ను జైల్లో పరామర్శకు వెళ్లేటప్పుడు.. జగన్ మామయ్య అంటూ ఓ చిన్నారి ఏడుపు కూడా వైసీపీ సోషల్ మీడియా కల్పితమే. అది ఇట్టే బయటకు వచ్చింది. సోషల్ మీడియా వైఫల్యాన్ని బయటపెట్టింది.
* విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే మౌనంగా ఉండాలి. కానీ దాంతో విశాఖలో నీరు మొత్తం ఇంకిపోతుందని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయవద్దని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే గూగుల్ డేటా సెంటర్ ను ఆహ్వానించారు.
* తాజాగా రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారు. తుఫాన్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రేపు తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి రాక అంటూ అప్డేట్లు ఇవ్వడం కూడా వైసిపి సోషల్ మీడియా వైఫల్యమే.
* ప్రజలు తుఫాను కష్టాల్లో ఉండి.. ప్రభుత్వం సహాయ చర్యల్లో నిమగ్నమై ఉండగా.. ప్రధాన ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో ఉండడం ఏమిటనే ఆలోచన ప్రజలకు తెస్తున్నది వైసీపీ సోషల్ మీడియానే. ఇకనైనా మేల్కొనక్కుంటే వైసీపీకి ఇది ఇబ్బందికరమే.