Smart Ration Cards In AP: ఏపీ ప్రభుత్వం( AP government ) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనుంది. ఈరోజు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలోని కోటి 45 లక్షల మంది రేషన్ కార్డుదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నీటి నుంచి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 1.45 కోట్ల కార్డుదారులకు గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
* కొత్త రేషన్ కార్డులు సైతం..
పాత రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు( Smart cards ) అందించడంతో పాటు కొత్త రేషన్ కార్డులు సైతం అందించనున్నారు. 6.71 లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని వేడుకగా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరపాలని సూచించింది. మరోవైపు రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియగా చెబుతోంది ప్రభుత్వం. స్మార్ట్ రేషన్ కార్డుల పై ప్రభుత్వ రాజముద్ర, కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటాయి. స్మార్ట్ రేషన్ కార్డుల జారీ, పంపిణీలో సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు సంప్రదించవచ్చు.
* నాలుగు విడతల్లో పంపిణీ..
ఈరోజు నుంచి 4 విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది. తొలి విడతలో భాగంగా విశాఖ,విజయనగరం, నెల్లూరు,ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో పంపిణీ చేస్తారు. ఆగస్టు 30 నుంచి గుంటూరు, ఏలూరు, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. చివరి విడతగా సెప్టెంబర్ 15 నుంచి పల్నాడు, బాపట్ల, వైయస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాలో స్మార్ట్ ఫ్యాషన్ కార్డుల పంపిణీ జరగనుంది. వచ్చేనెల రేషన్ కు సంబంధించి ఈ స్మార్ట్ కార్డుల ద్వారానే పంపిణీ జరగనుంది. ఈ స్మార్ట్ కార్డుల సరఫరా అనేది పూర్తిగా ఉచితం.