https://oktelugu.com/

Pawan Kalyan vs Jagan : ‘అరటిపండు తొక్క జగన్ అన్న బొక్క’ నినాదాలతో దద్దరిల్లిన పవన్ కళ్యాణ్ పిఠాపురం సభ!

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం కి అక్కడకి వచ్చిన అభిమానుల్లో ఉత్సాహం పదింతలు రెట్టింపై సభ ప్రాంగణం మొత్తం 'అరటి పండు తొక్క జగన్ అన్న బొక్క' అని నినదిస్తూ మారుమోగిపోయేలా చేసారు.

Written By: , Updated On : June 17, 2023 / 08:33 AM IST
Follow us on

Pawan Kalyan vs Jagan : ఎంతో కాలం నుండి కోట్లాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ శ్రేణులు ఎదురు చూసిన ‘వారాహి యాత్ర’ ఇటీవలే కత్తిపూడి సభ తో ప్రాంభమై నేడు పిఠాపురం కి చేరుకుంది. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టగానే జనవాహిని ఆయనకీ కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికింది. మొదటి సభ కత్తి పూడి కంటే , పిఠాపురం సభకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అడుగడుగునా ఆయనకీ జనాలు నీరాజనాలు పలుకుతూ దేవుడిని ఊరేగించినట్టు ఊరేగిస్తూ తీసుకెళ్లారు. మిట్టమధ్యాహ్నం 43 డిగ్రీల ఉష్ణోగ్రత లో కూడా అభిమానులు ఓపికగా నిల్చొని ఏర్పాట్లు చేసారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం వైసీపీ పార్టీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైసీపీ వైఫల్యాలను, చేస్తున్న దౌర్జన్యాలను పవన్ కళ్యాణ్ ఎండగట్టిన తీరుకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం కి అక్కడకి వచ్చిన అభిమానుల్లో ఉత్సాహం పదింతలు రెట్టింపై సభ ప్రాంగణం మొత్తం ‘అరటి పండు తొక్క జగన్ అన్న బొక్క’ అని నినదిస్తూ మారుమోగిపోయేలా చేసారు. అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి స్పాండిస్తూ ‘(నవ్వుతూ) నాకు ఆ మనిషిని కావాలని తిట్టించాలని లేదు, చేస్తున్న పనులన్నీ అలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక కాకినాడలో ఉన్న MLA ద్వారంపూడి, జగన్ కి కుడిభుజం లాంటి వ్యక్తి అయినా అతను జనసేన కార్మికులపై చేయించిన దాడిని గుర్తు చేస్తూ ‘ఈ కాకినాడ MLA దగ్గర ఎవరో ఒకడు ఉంటాడంట, వాడి పేరు రేపు చెప్తాలే ,వాడు పిస్తోల్ తీసి బెదిరిస్తుంటారు అంట , ఆలాగే భీమాస్ రెడ్డి అంట ఆయనెవరో, వీళ్లందరి సంగతి ఎల్లుండి కాకినాడ సభలో చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.