Pawankalyan : జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం : పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్

సోషల్ మీడియా లో ఆ హీరోల అభిమానులు ఆ వీడియో ని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. తమ హీరోల పేర్లు తీసినందుకు ధన్యవాదాలు అంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Written By: Vicky, Updated On : June 17, 2023 8:34 am
Follow us on

Pawankalyan : ‘వారాహి’ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురం లో సభ ని ఏర్పాటు చేసాడు. ఈ సభకి అభిమానులు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేసారు. ముందుగా ర్యాలీగా సభ స్థలికి చేరుకున్న పవన్ కళ్యాణ్, ఈ ర్యాలీలో ఆయనకీ అడుగడునా జనాలు నీరాజనం పలికారు. ఇంత రెస్పాన్స్ వస్తుంది అని ఊహించారు కానీ, పిఠాపురం లో ఉన్న జనాభాలో 50 శాతం పవన్ కళ్యాణ్ సభలోనే ఉన్నారా అనేంతలా వస్తారని మాత్రం ఊహించలేదు.

ఈ సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. వ్యంగ్యాస్త్రాలు సందిస్తూనే,మరోపక్క ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ఆవేశం తో మాట్లాడిన మాటలు జనాల్లోకి బాగా వెళ్ళింది. ముఖ్యంగా పిఠాపురం ప్రాంతం లో ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అక్కడ ఉన్న స్థానికులకు కూడా తెలియని కొన్ని అంశాలను ఎత్తిచూపుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సమస్యల గురించి ప్రస్తావిస్తూ మధ్యలో ఆయన ఇతర స్టార్ హీరోల మద్దతుని కూడా కోరాడు, ఆయన మాట్లాడుతూ ‘సినిమాల పరంగా నేను నా తోటి స్టార్ హీరోలను ఎంతో అభిమానిస్తూ ఉంటాను,వాళ్ళ సినిమాలు సమయం దొరికినప్పుడల్లా చూస్తుంటాను. రామ్ చరణ్ ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం, ప్రభాస్ గారంటే ఇష్టం, ఇలా వీళ్లందరి సినిమాలను చూస్తుంటాను, మీరు కూడా సోషల్ మీడియా లో జరిగే విషయాలను పట్టించుకోకుండా , అందరూ ఒక తాటిపై నిలబడి జనసేన పార్టీ కి సపోర్టు చెయ్యండి అంటూ పవన్ కళ్యాణ్ అడగడం ఆయా హీరోల అభిమానులకు బాగా నచ్చింది. సోషల్ మీడియా లో ఆ హీరోల అభిమానులు ఆ వీడియో ని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. తమ హీరోల పేర్లు తీసినందుకు ధన్యవాదాలు అంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.