Temple Tragedy in Andhra Pradesh: దేవుడి మీద భక్తి ఉండాలి. దేవుడిని దర్శించుకోవడానికి ఆసక్తి ఉండాలి.. ఇదే సమయంలో ఆత్రుత ఉండకూడదు. లేనిపోని ప్రచారాలను నమ్మకూడదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రచారాలకే విలువ పెరిగిపోయింది. ప్రచారాలనే జనం నమ్మడం అధికమైంది.. అందువల్లే జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న తొక్కిసలాటలు సామాన్య భక్త జనాలను భయభ్రాంతులకు
గురిచేస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ సంఖ్య పెరిగిపోయింది. ఏదైనా పుణ్యక్షేత్రం లేదా దర్శనీయ ప్రాంతం మీద వీడియోలు రూపొందించడం.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. పైగా వాటికి రీచ్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో సామాన్య జనాలు ఆకర్షితులవుతున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అందువల్లే వివిధ పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రాంతాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. ముఖ్యంగా పవిత్ర మాసాల సమయంలో భక్తుల రాక అధికంగా ఉంటున్నది.
అనుకోని సంఘటనలు
భక్తులు అధికంగా వచ్చినప్పుడు ఊహించని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల తొక్కి సలాటలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉంటున్నది. ఈ ఏడాది జనవరి నెల 8వ తేదీన తిరుపతి ప్రాంతంలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల విక్రయాలు జరిపారు. ఈ క్రమంలో భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు చనిపోయారు. దీనిని మర్చిపోకముందే నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది దుర్మరణం చెందారు.
ఎందుకిలా?
కొత్త ప్రాంతాలను చూసేందుకు ఇటీవల కాలంలో జనాలలో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కోరిక పెరిగిపోయింది. అందువల్లే ఆయా దర్శనీయ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాలను కొత్తగా చెప్పడంతో జనాలు ఆకర్షితులవుతున్నారు. అందువల్లే ఆ ప్రాంతాలు నిత్యం సందడిగా ఉంటున్నాయి. తిరుపతి కావచ్చు, కాశి బుగ్గ కావచ్చు.. ప్రాంతం ఏదైనా సరే ఈ తరహా సంఘటనలు జరగడం వల్ల అమాయకులైన జనాలు దుర్మరణం చెందుతున్నారు.
ఆంధ్రాలోనే ఎందుకిలా
ఆంధ్ర ప్రాంతంలో దర్శనీయ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇక్కడ ప్రకృతి ఆసక్తికరంగా ఉంటుంది. కాశిబుగ్గ ప్రాంతంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనదని ఇటీవల చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు వీడియోలు రూపొందించారు. ఆ వీడియోలు చూసిన చాలామంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి పోటీపడ్డారు. పైగా ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో చాలామంది భక్తులు అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు.. దీనికి తోడు భక్తుల క్యూ మార్గంలో రేయిలింగ్ కూలిపోయింది. దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు కదలడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో చూస్తుండగానే చాలామంది గాయపడ్డారు. మిగతావారు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్…
— PMO India (@PMOIndia) November 1, 2025