Andhra Pradesh Woman Suicide: మరో నాలుగు రోజుల్లో రాఖీ పౌర్ణమి.. తన సోదరి వస్తుందని.. తనకు రాఖీ కడుతుందని ఆ తమ్ముడు సంబరపడిపోయాడు. అక్కకు ఏ కానుక పెట్టాలి.. అనే ఆలోచనలో ఉండిపోయాడు. పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. అతని ఆలోచన పై విధంగా ఉంటే.. అతడి సోదరి చేసిన పని మరో విధంగా ఉంది.
Also Read: ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్.. అధికారులకు ఊహించని పరిణామం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలోని కలువపాముల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. శ్రీవిద్య అనే 24 సంవత్సరాల యువతి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నది. ఈమెకు రాంబాబు అనే విలేజ్ సర్వేయర్ తో 6 నెలల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత రాంబాబు తనలో ఉన్న రాక్షసుడిని శ్రీవిద్యకు పరిచయం చేయడం మొదలుపెట్టాడు. “వేరే అమ్మాయి లాగా నీ శరీరం ఎందుకు లేదు. నువ్వు అలానే ఎందుకు ఉంటున్నావ్.. ఆ దుస్తులు ఎందుకు ధరిస్తున్నావ్.. జుట్టు అలా ఎందుకు దువ్వుకుంటున్నావ్.. పువ్వులు ఎవరికోసం పెట్టుకున్నావ్.. లో దుస్తుల సైజు ఈమధ్య ఎందుకు పెరిగింది” అంటూ అతడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక శ్రీవిద్య తనలో తానే కుమిలిపోయింది. పైగా రాంబాబు ఇటీవల ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. “అందరితో కలివిడిగా ఎందుకు మాట్లాడుతున్నావ్.. వారికి నీకు ఏంటి సంబంధం.. నువ్వు పని చేసే కాలేజీలో ఏమైనా వ్యవహారాలు కొనసాగిస్తున్నావా.. నీకు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు వస్తాయి.. నీకు ఎవరు ఫోన్ చేస్తున్నారు.. అసలు నువ్వు కాలేజీలో పని చేయకుండా ఇంటి దగ్గర ఉంటే బెటర్ కదా” అని అంటూ ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. పైగా తీవ్రంగా కొడుతున్నాడు. అతడు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక శ్రీ విద్య బలవన్మరణానికి పాల్పడింది.
Also Read: భర్త సుఖపెట్టడం లేదని కడతేర్చింది
రాంబాబు మొదటి నుంచి కూడా ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడేనని స్థానికులు చెబుతున్నారు. అతడు ఎవరితో ఎక్కువగా మాట్లాడని.. ఒంటరిగా ఉంటాడని.. ఎవరైనా మంచి దుస్తులు వేసుకున్నా తట్టుకోలేడని.. అమ్మాయిలపై దురుసు వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాడని.. శ్రీవిద్యతో వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నాడని.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని ఆ అమ్మాయికి చూపించడం మొదలుపెట్టాడని స్థానికులు అంటున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు శ్రీవిద్య ఆత్మహత్యకు ముందు ఒక లేఖ రాసింది. ” నేను వెళ్ళిపోతున్న తమ్ముడు. నేను ఇక నీకు రాఖీ కట్టలేను. అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ” శ్రీవిద్య ఆ లేఖలో పేర్కొంది.. తన సోదరి రాసిన లేఖను చూసి ఆ తమ్ముడు గుండెలు పగిలే విధంగా రోదిస్తున్నాడు. శ్రీవిద్య బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో.. పోలీసులు రాంబాబును, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.