Homeఆంధ్రప్రదేశ్‌Singer mangli : ఆ ఒక్క పాటతో కెరీర్ కోల్పోయా.. సింగర్ మంగ్లీ బాధ వెనుక...

Singer mangli : ఆ ఒక్క పాటతో కెరీర్ కోల్పోయా.. సింగర్ మంగ్లీ బాధ వెనుక కారణం ఇదీ

Singer mangli :  సినీ రంగానికి చెందినవారు రాజకీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మూల్యం తప్పదు. ఈ విషయంలో తాను బాధితురాలిగా మారానని సినీ గాయని మంగ్లీ ( singer mangli) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆమె రాజకీయాల వల్ల తనకు అవకాశాలు లేకుండా పోతున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆమె ప్రత్యేక ప్రకటన చేసుకోవాల్సి వచ్చింది. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. తనపై జరుగుతున్న ప్రచారం తప్పు అని ఖండిస్తూ ఆమె ఒక లేఖ జారీ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అంశంగా మారుతోంది.
 * శ్రీకాకుళంలో వివాదం
 ఇటీవల సింగర్ మంగ్లీ శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) వెళ్లారు. అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్నారు. అదే రోజు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. అదే సమయానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లారు. విఐపి దర్శనాల్లో భాగంగా కేంద్రమంత్రి తో పాటు మంగ్లీ కూడా వెళ్లడం వివాదంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన మంగ్లీ కి ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్తారా అంటూ టిడిపి శ్రేణులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు( central minister Ram Mohan Naidu ) ను నిలదీసినంత పనిచేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనిపై రామ్మోహన్ నాయుడు ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ మంగ్లీ తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తూ.. జారీ చేసిన లేఖ ఇప్పుడు వైరల్ అంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాట పాడడంతో ఎన్నో రకాల అవకాశాలు కోల్పోయానని.. ఎన్నెన్నో అవమానాలు పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 * 2019 ఎన్నికల్లో విశేష ప్రాచుర్యం 
 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ కోసం ఆమె పాడిన పాట సూపర్ హిట్ గా నిలిచింది. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంగ్లీకి ఎనలేని గౌరవం దక్కింది. ఆమెను ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓ విభాగానికి సంబంధించి సలహాదారుగా కూడా నియమించారు. ఆమెకు టీటీడీలో ఎనలేని గౌరవం దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో ఓ రెండు నియోజకవర్గాల వైసీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. అదే ఇప్పుడు శాపంగా మారింది. కూటమి అధికారంలోకి రావడంతో మంగ్లీ టార్గెట్ అవుతున్నారు. మొన్నటి అరసవల్లి దేవస్థానం ఇష్యూలో మంగ్లీ మరింత వైరల్ గా మారారు. దీంతో ఆమె ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది.
 * తనను ఎవరు సంప్రదించలేదు 
 దేశంలోనే గుర్తింపు పొందిన నాయకుల్లో చంద్రబాబు( Chandrababu) ఒకరని.. అటువంటి నేతపై తనకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు మంగ్లీ. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు తనను పాట పాడాలని సంప్రదించలేదని.. వారు సంప్రదించినా తాను పాట పాడనని అనలేదని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో తాను ఏ పార్టీకి సైతం పాడని విషయాన్ని గుర్తు చేశారు. ఓ గిరిజన మహిళగా.. తనకు తెలుగు ప్రజలు విశేషంగా ఆదరించారని.. తన పాట ప్రతి పల్లెలో పండుగ వాతావరణం నింపాలని అనుకున్నానని.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. ఆ కోణంలో తనను చూడవద్దని మంగ్లీ విజ్ఞప్తి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version