Homeఆంధ్రప్రదేశ్‌Sikkolu Janapadam popularity: సినిమా మాధ్యమానికి ధీటుగా సిక్కోలు జానపదాలు!

Sikkolu Janapadam popularity: సినిమా మాధ్యమానికి ధీటుగా సిక్కోలు జానపదాలు!

Sikkolu Janapadam popularity: శ్రీకాకుళం( Srikakulam) అలియాస్ సిక్కోలు. ఈ మాట చెబితే వెనుకబాటుతనం అనే అపవాదు. అయితే అభివృద్ధి పరంగా వెనుకబాటే కానీ.. ప్రతి రంగంలో సిక్కోలు అనేది ముందంజలో ఉంది. దేశంలో ఏ నగరంలోనైనా శ్రమజీవులు సిక్కోలు వాసులు. పేరు మోసిన నగరాల్లో సిక్కోలు బస్తీలు కూడా ఉంటాయి. నమ్మకంగా పనిచేయడం సిక్కోలు వాసులకు ఉంటే సహజ లక్షణం. అసలు సిసలు గ్రామీణ నేపథ్యానికి ప్రతీక కూడా శ్రీకాకుళం. స్వాతంత్రం ముందు.. స్వాతంత్రానికి తరువాత ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది కూడా శ్రీకాకుళం. జానపదాలకు చిరునామా. కళామతల్లి ముద్దుబిడ్డలు ఈ నేల నుంచి గొంతు ఎత్తి పాడారు. స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇక్కడి జంగాలు కదలే ప్రముఖ బుర్రకథ పితామహుడు నాజర్ కు బుర్రకథ అయ్యింది. తెల్లోడిని గడగడలాడించిన గరిమెళ్ళ మాకొద్ది తెల్లదొరతనం పాట.. ఇక్కడి గంగిరెద్దుల వాళ్లు పాడుకున్నా పాట నుంచి పుట్టినదే. సుబ్బారావు పాణిగ్రహి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా.. రాసిన జముకుల కథ.. మన బోనెల అసిరయ్య లాంటి ఎంతోమంది కళాకారులు పాడుకునే బుడబుక్కల పాట నుంచి వచ్చినదే. పొలం పనుల్లో పొలికేక పాటే పోరాటాలకు తొలి కేక గా మారింది. అలా జానపదం తన రూపాన్ని మార్చుకుంటూ.. ఇప్పటికీ సజీవంగా ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఔత్సాహిక జానపద కళాకారుల కళా నైపుణ్యం వెలుగు చూస్తూనే ఉంది.

జిల్లాది ప్రత్యేక స్థానం..
జానపదాల్లో శ్రీకాకుళం జిల్లా ది ప్రత్యేక స్థానం. జానపద ఆటపాటలకు నిలయం. ఇక్కడ జనాన్ని మెప్పించే ఎన్నో కళారూపాలు ఉన్నాయి. తోలుబొమ్మలాట( tholu bommalata ), జముకుల పాట, తప్పెటగుళ్ళు, తూర్పు భాగవతం, గంగిరెద్దులాట, బుడిగజంగాలు, మాల దాసర్లు, ఎరుకుల పాటలు, గంటల సాయిబులు, చెక్కభజన, కోలాటం, పండరి భజన, బుట్ట బొమ్మలు, చెంచు పాటలు, డప్పు కళాకారులు, పాములాట, అంజట.. ఇలా చెప్పుకుంటూ పోతే సహజ సిద్ధమైన జానపదాలకు అసలు సిసలు చిరునామా శ్రీకాకుళం. ప్రధానంగా ఉద్దాన ప్రాంతం జానపద కళలకు, కళాకారులకు పుట్టినిల్లు.

సోషల్ మీడియాతోనే..
సోషల్ మీడియా( social media) పుణ్యమా అని శ్రీకాకుళం జానపదాలకు ఎనలేని ఆదరణ దక్కుతోంది. జానపదం అనేది ఒకరిద్దరూ నేపథ్యం నుంచి వచ్చినది కాదు. ఇప్పుడు ఉద్దానంలో జానపద ఔత్సాహిక కళాకారులు పెరిగారు. వేదిక ఏదైనా జానపదాలతో జనరంజకం అవుతున్నారు. జనం నుంచి వచ్చిన పాట.. జనం మెచ్చిన పాటగా మార్చుతూ.. సామాన్యుడిని సైతం ఆకట్టుకునేలా జానపదాలతో రస రమ్యంగా పాడుతున్నారు. సినిమా మాధ్యమానికి ధీటుగా జానపదాలకు వన్నె తెస్తున్నారు. వివాహాలు, వినాయక చవితి వేడుకల్లో కూడా శ్రీకాకుళం జానపదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కనుమరుగవుతున్న శ్రీకాకుళం జానపదాలు సోషల్ మీడియా పుణ్యమా అని ఆదరణ పెంచుకుంటున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version