Homeఆంధ్రప్రదేశ్‌Shock to Thalliki Vandanam Scheme: తల్లికి వందనంకు ‘కరెంట్’ షాక్.. ఇలాగైతే కష్టమే.. కౌంటర్లు...

Shock to Thalliki Vandanam Scheme: తల్లికి వందనంకు ‘కరెంట్’ షాక్.. ఇలాగైతే కష్టమే.. కౌంటర్లు షురూ

Shock to Thalliki Vandanam Scheme: కూటమి ప్రభుత్వం( Alliance government ) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏడాది పాలన పూర్తయిన తరుణంలో కీలకమైన తల్లికి వందనం పథకం అమలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ప్రకటించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేసింది. ఒక్కో కుటుంబంలో ఐదుగురు పిల్లల వరకు లబ్ధి పొందారు. అయితే ఈ విషయంలో ప్రజల నుంచి సంతృప్తి కనిపిస్తోంది. కానీ రకరకాల మార్గదర్శకాలు, నిబంధనల రూపంలో పథకానికి అనర్హులుగా మిగిలిన వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైసిపి ఏ కారణంతో అమ్మబడి పథకాన్ని నిలిపివేసిందో.. ఇప్పుడు అవే కారణాలతో తల్లికి వందనం నిధులు సైతం జమ కాలేదు. దీనిపై రకరకాలుగా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Also Read: AP People Owe Gratitude to Modi?: ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలట

విద్యుత్ బిల్లు సాకుతో..
ప్రధానంగా 300 యూనిట్ల విద్యుత్ వినియోగం( electricity use) నిబంధనతో లక్షల మంది లబ్ధిదారులు పథకానికి దూరమయ్యారు. చాలామంది వినియోగించకుండానే.. సాంకేతిక లోపాలతో తల్లికి వందనం నిధులు జమ కాలేదు. పెద్ద ఎత్తున అనర్హుల జాబితాలో చేర్చారు. అయితే ఇటువంటి వారు తమ అర్హతను నిరూపించుకుంటే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి తగిన సమయం కూడా ఇచ్చింది. ముఖ్యంగా 3 యూనిట్ల వినియోగం విషయంలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి తల్లికి వందనం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించి గ్రీవెన్స్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది.

Also Read: PMK Ramadoss vs Anbumani: అన్నాడీఎంకే బీజేపీ కూటమికి తలనొప్పిగా మారిన పీఎంకే చీలిక

అప్పట్లో కామెంట్స్ ను తెరపైకి తెస్తూ..
గతంలో అమ్మ ఒడి( Ammavody) అమలు సమయంలో చాలామందికి నిబంధనల పేరిట నగదు జమ కాలేదు. అప్పట్లో సైతం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇదే అదునుగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో వింత ప్రచారాన్ని తెరలేపాయి. అప్పట్లో కూటమి నేతలు అమ్మ ఒడి సక్రమంగా అమలు కాలేదని.. అసలు ఇంటి కరెంటు బిల్లుతో అమ్మ ఒడికి ఏంటి సంబంధం అని నిలదీసిన వారు ఉన్నారు. అటువంటి నేతల పాత వీడియోలను ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తోంది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో అమ్మ ఒడిలో నిబంధనలను ప్రశ్నించారు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సొంత ప్రభుత్వ పథకం పై రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తున్నట్టు ఆ వీడియోను రూపొందించారు. దానినే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version