YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది. పాత పాలసీతో ప్రజలకు అధిక ధరలకు మద్యం అమ్మారని, నకిలీ మద్యం విక్రయించారని ఆరోపించింది. తాజాగా తెలంగాణ తరహాలో నూతన ఎక్సైజ్ పాలసీని అముల చేయాలని నిర్ణయించింది. 3 వేలకుపైగా మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు లాటరీ పద్ధతిలో కేటాయించింది. అక్టోబర్ 17 నుంచి నూతన మద్యం పాలసీ అములలోకి రానుంది. ఇందులో 99 రూపాయలకే మద్యం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే మద్యం షాపుల కేటాయింపుపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు మద్యం సిండికేట్లను అరికట్టడంలో చోద్యం చూశారని ఆరోపించారు. అధికార కూటమి నేతలకే 3 వేలకుపైగా దుకాణాలు కట్టబెట్టారని పేర్కొన్నారు. కొందరు నేతలు టెండర్లు వేయొద్దని బెదిరించారని, టెండర్ వేసి షాపు దక్కించుకున్నా తమకు కమీషన్ ఇవ్వాలని బహిరంగంగానే భయపెట్టారని, గుర్తుచేశారు. షాపుల కేటాయింపులో పారదర్శకత, నిస్పాక్షితక ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుందన్నారు.
వారి కనుసన్నల్లోనే..
ఏపీలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు చక్రం తిప్పారని ఆరోపించారు. తమను కాదని టెండర్ వేస్తే ప్రాణాలు పోతాయని కూడా బెదిరించారని తెలిపారు. మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తామని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అయినా చర్యలు లేవు..
ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం ఉండదన్న సీఎం చంద్రబాబు.. ఏసీ రూంలో కూర్చొని హెచ్చరికలు జారీ చేశారని, క్షేత్రస్థాయిలో సొంత పార్టీ నేతలపై కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం గుడిచి మింగేస్తే.. మీరు గుడిలో లింగాన్ని కూడా మింగేస్తున్నారని విమర్శించారు. మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించే ప్రణాళిక అమలు చేయబోతున్నారని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల దోపిడీకి కూటమి సర్కార్ తెరలేపిందని అన్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sharmilas sensational comments on liquor shops alliance sarkar with over 3000 liquor shops in the hands of syndicates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com