YS Sharmila: జగన్ వైపు దూసుకొస్తున్న షర్మిల ‘బాణం’..!

Sharmila: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నారు. వైఎస్ జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీకి అన్ని తానై ముందుండి నడిపించారు. ‘జగన్ వదిలిన బాణాన్ని నేను’ కోట్లాది మంది వైఎస్ అభిమానులను ఆకర్షించి తండ్రికి తగ్గ తనయురాలని నిరూపించుకున్నారు. అయితే ఆ బాణం ఇప్పుడు జగన్ వైపు దూసుకెళుతుండటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వైఎస్ జగన్ జైలు నుంచి విడుదలయ్యాక వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన అన్నతో కలిసి […]

Written By: NARESH, Updated On : January 4, 2022 12:45 pm
Follow us on

Sharmila: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నారు. వైఎస్ జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీకి అన్ని తానై ముందుండి నడిపించారు. ‘జగన్ వదిలిన బాణాన్ని నేను’ కోట్లాది మంది వైఎస్ అభిమానులను ఆకర్షించి తండ్రికి తగ్గ తనయురాలని నిరూపించుకున్నారు. అయితే ఆ బాణం ఇప్పుడు జగన్ వైపు దూసుకెళుతుండటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

YS Sharmila

వైఎస్ జగన్ జైలు నుంచి విడుదలయ్యాక వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన అన్నతో కలిసి షర్మిల గట్టిగానే పని చేశారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం షర్మిల ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె వైసీపీలో ఎలాంటి పదవీ కూడా లభించలేదు. ఇక జగన్ తో విబేధాల కారణంగానే ఆమె ఏపీని వదిలి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించి అక్కడి సమస్యలపై పోరాడుతున్నారు.

నిరుద్యోగ, రైతు సమస్యలపై షర్మిల తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ కోసం చివరి రక్తబొట్టు వరకు పోరాడుతానన్న షర్మిలా తాజాగా ఏపీలో తాము పార్టీ పెట్టకూడదనే రూల్ ఏమైనా ఉందా? అంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

షర్మిల వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఏపీలో పార్టీ పెడుతామనే సంకేతాలను ఇవ్వడం వ్యూహాత్మకమని అర్ధమవుతోంది. తన అన్న జగన్ తో తేల్చుకోలేనంత విబేధాలు రావడంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.  షర్మిల ఏపీ రాజకీయాలపై దృష్టిసారించారనే విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ముందుగానే సమాచారం ఇస్తున్నారు.

Also Read: జగన్‌తో విభేదించిన షర్మిల.. అన్నా చెల్లెలి మధ్య ఘర్షణ.. ఏ విషయాల్లోనంటే?

జగన్ ను దారికి తెచ్చుకోవాలంటే ఏపీలో పార్టీ పెట్టాలనే సలహాను ఆయన తన మీడియా ద్వారా పంపుతారు. ఈక్రమంలోనే ఏపీకి చెందిన పలువురు నేతలు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణకు ఆమెను ఆహ్వానిస్తున్నారు. త్వరలోనే ఆమె ఏపీలో పర్యటించి వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరిచడంతోపాటు అక్కడి ప్రజల స్పందన తెలుసుకోనున్నరనే ప్రచారం జరుగుతోంది. తద్వారా ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనుంది.

షర్మిలా నిజంగానే ఏపీలో పర్యటిస్తే అక్కడి రాజకీయాల్లో కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కన్పిస్తోంది. వైఎస్ఆర్ కుమార్తెగా ఏపీలో ఆమెకు పూర్తిస్థాయి మద్దతు రావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తన వైపు వస్తున్న బాణాన్ని శాంతింప చేస్తారా? లేదంటే మొండికి ఎదురెళ్లి కష్టాలను కొనితెచ్చుకుంటారా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

Also Read: అమరావతి ఉద్యమానికి చెక్ చెప్పే జగన్ కొత్త వ్యూహం