Sharmila Political Strategy: ఏపీలో( Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు అధ్యక్షురాలు షర్మిల. ప్రత్యేక వ్యూహంతో ముందుకెళితే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆమె భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఓట్లతోపాటు సీట్లు పెంచుకునే విధంగా పావులు కదుపుతున్నారు. అందుకే హై కమాండ్ ఆదేశాల మేరకు పార్టీ యాక్టివ్ కమిటీ ఒకటి వచ్చింది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఒకటి నియమించారు. ప్రాంతాలవారీగా కోఆర్డినేటర్లు సైతం నియమితులయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ఒకరు అవసరం అని భావించారు. హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఓ వ్యూహకర్త.. ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో షర్మిల కీలక భేటీ జరిగిందని.. డీల్ పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: టార్గెట్ వైసిపి.. కాంగ్రెస్ లోకి బలమైన కుటుంబం?
ప్రశాంత్ కిషోర్ సహచరులుగా..
దేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల రాజకీయ వ్యూహకర్తలు ఐ ప్యాక్( ipak ) నుంచి వచ్చినవారే. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ లో పనిచేసిన చాలామంది.. సొంతంగా వ్యూహ బృందాలను ఏర్పాటు చేసుకొని వివిధ రాజకీయ పార్టీలకు సేవలు అందిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న రాబిన్ శర్మ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న రిషి రాజ్ సింగ్ సైతం ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరులే. కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించారు సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మహమ్మద్ ఖుర్షిద్ హుస్సేన్. కర్ణాటకలో తన రాజకీయ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన పేరు ఆయనకు ఉంది. ఏపీలో సైతం కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలందిస్తారని తెలుస్తోంది. తన రాజకీయ సలహాదారుగా నియమించాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఏపీ విషయంలో షర్మిల గట్టు వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఐ ప్యాక్లో కీలక పాత్ర..
గతంలో ఐప్యాక్ లో సీనియర్ అసోసియేట్ గా పనిచేసేవారు ఖుర్షిద్ హుస్సేన్( Khurshid Hussain ). 40% టాక్స్ సర్కార్ వంటి సోషల్ మీడియా వ్యూహాలతో బిజెపి ఓటమిలో కీలకపాత్ర పోషించారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి హుస్సేన్ పది కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతోనే కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. రాష్ట్ర విభజనతో ఉనికి కూడా కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ స్థానంలో వైసిపి అవతరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీయే వైసిపి గా మారింది. అయితే టిడిపికి వ్యతిరేకించే నాయకులంతా వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. అందుకే టిడిపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అన్న మాదిరిగా రాజకీయాలు చేయాలని హుస్సేన్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:షర్మిలకు షాక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లు గా ఆ ఇద్దరు!
రేవంత్ సహకారంతో..
ఇంకోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) సహకారంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీనియర్ నేత కెవిపి రామచంద్రరావుకు పై కమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఇండియా కూటమిలో వామపక్షాలు ఉన్నాయి. వాటి సహకారంతో ప్రజా పోరాటాలు చేస్తూనే రాజకీయ వ్యూహాలు రూపొందించాలని సూచించినట్లు సమాచారం. అయితే రాజకీయ వ్యూహకర్త ఉంటే కానీ అది సాధ్యం కాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవైపు రాజకీయ సలహాదారులు నియమిస్తూనే విజయవాడలో అందరికీ అందుబాటులో ఉండేలా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని షర్మిల భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవైపు టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. వైసీపీని బలహీనపరచడం ద్వారా బలపడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.