AP Election Survey 2024
AP Election Survey 2024: ఏపీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఎండలతో పాటు రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అటు అధికార వైసిపి, విపక్ష కూటమి మేనిఫెస్టోలను ప్రకటించాయి. ప్రజల మధ్యకు వెళ్తున్నాయి. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ రైజ్.. తాను చేపట్టిన సర్వే ఫలితాలను ప్రకటించింది.ఏపీలో విజేత ఎవరు అనేది తేల్చింది.
గత నెల 24 వరకు రైజ్ సర్వే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టినట్లు సంస్థ ప్రతినిధి పుల్లట ప్రవీణ్ తెలిపారు. టిడిపి కూటమి స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అధికార వైసిపి 41 నుంచి 54 స్థానాల్లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది. 34 స్థానాల్లో హోరాహోరి ఫైట్ తప్పదని తేల్చి చెప్పింది ఈ సర్వే. ఒక స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవనుందని సర్వే తేల్చి చెప్పడం విశేషం. ఒక్క రాయలసీమలో మినహా మిగతా ప్రాంతాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూటమి 18 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. వైసిపి ఏడు సీట్లను దక్కించుకునే అవకాశం ఉన్నట్లు ఈ సంస్థ తేల్చింది. కూటమి పార్టీలకు 51 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంది. అధికార వైసిపి 44% ఓట్లు పొందుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఏపీలో ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా వెలడైంది ఈ సర్వే ద్వారా.వరుస సర్వేల్లో ఎన్డీఏ కూటమికి సానుకూల ఫలితాలు వస్తుండగా.. అధికార వైసిపికి చుక్కెదురు అవుతుండడం ఆ పార్టీకి మింగుడు పడని విషయం.