NTR Jayanthi – Pawankalyan : నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజలు నివసించే ఇతర దేశాల్లో కొనసాగుతున్నాయి. శత జయంతి వేడుకలు ఒకవైపు.. టీడీపీ మహానాడు రాజమండ్రి లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు బాలక్రిష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ కు నేతలు, వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ లో శత జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు గడ్డ పై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకరని పవన్ కొనియాడారు. దేశంలో సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజుల్లో.. ఓ రాజకీయపార్టీని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ ఒక అభ్యుదయ వాది అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానన్నాను అని జనసేనాని తెలిపారు.
రూ.2 లకే కిలో బియ్యం పథకం పెట్టి సంక్షేమానికి ఆధ్యుడిగా నిలిచారని.. ఢిల్లీ పెత్తనాన్ని సహించలేక ఎదురొడ్డిన నాయకుడిగా వర్ణించారు. తెలుగు భాషపై ఎన్టీఆర్ కు ఉన్న మక్కువ, పట్టు తననెంతగానో ఆకట్టుకునేవని పవన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగు భాష కీర్తి ప్రతిష్ఠలను దేశ నలుమూలలకు వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, అలాంటి నేత శతజయంతి సందర్భంగా తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున అంజలి ఘటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Today is Sr. N.T.R Jayanthi. NTR ki Janmadina Subhakankshalu, We miss you. :((
– From #PawanKalyan fans@PSPK_FC pic.twitter.com/NcjcqZl4OB
— PawanKalyan Fan (@PawanKalyanFan) May 27, 2013