Journalist Krishnam Raju Arrested: రాజధాని అమరావతి( Amravati capital ) మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి ఛానల్ డిబేట్లో పాల్గొన్న కృష్ణంరాజు.. అమరావతి రాజధాని లో ఆ తరహా మహిళలు ఉన్నారని కించపరుస్తూ మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది వివాదాస్పదం అయింది. అమరావతి మహిళలతోపాటు మహిళా సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు, వాటిని నియంత్రించక పోగా సంబంధించిన మరో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాక్షి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణంరాజు అరెస్ట్ కావడం విశేషం.
* కొమ్మినేని కి రిమాండ్
అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ముందుగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ను(Kommineni srinivasarao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కృష్ణంరాజును అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచి ఒక వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కొమ్మినేని అరెస్ట్ తర్వాత కృష్ణంరాజు కోసం పోలీసులు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయనను విశాఖలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. మరోవైపు సాక్షి యాజమాన్యం విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
* ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు..
అయితే ఈ కేసులో కృష్ణంరాజు( journalist Krishnam Raju ) హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు తనకోసం గాలిస్తున్నారని.. తనను అరెస్టు చేసి బాధించాలని చూస్తున్నారని పిటిషన్ లో విన్నవించారు. అమరావతి తో పాటు విజయవాడ చుట్టుపక్కల తనకు ఆస్తులు ఉన్నాయని.. తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే పోలీసులు జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన కొమ్మినేని కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఈరోజు విజయవాడకు తీసుకొచ్చి.. వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
* జగన్ గట్టి హెచ్చరికలు..
మరోవైపు జర్నలిస్టుల అరెస్టులను ఖండిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. ఇది ముమ్మాటికి మీడియా గొంతు నొక్కడమేనని చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల తరుపున ప్రశ్నిస్తున్నందుకే ఇలా కక్ష కట్టి కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. పాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రతి తప్పునకు చంద్రబాబు బాధ్యత వహించాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు.