Delivery boys: స్మార్ట్ ఫోన్.. అందులో స్విగ్గి లేదా జొమాటో యాప్.. నచ్చిన ఫుడ్ ఎంచుకోవడం.. లొకేషన్ సెండ్ చేయడం.. ఆర్డర్ రాగానే డబ్బులు చెల్లించి హాయిగా తినేయడం.. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి పెరిగిపోయింది.
వాస్తవానికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని.. ఆ సంస్థలు కూడా అంచనా వేయలేదు. కానీ ఎప్పుడైతే నగరాలలో ఈ కల్చర్ అలవాటు అయిందో అప్పటినుంచి దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.. ఇప్పటికే మనదేశంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారం జోరుగా సాగుతోంది.. కంపెనీలు అంతకంతకు గొప్ప గొప్ప లాభాలను నమోదు చేసుకుంటున్నాయి. అయితే చాలామంది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనే విధానాన్ని గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు. దీనిని ఒక వింతగా.. ఆశ్చర్యంగా భావిస్తున్నారు. కానీ 90 సంవత్సరాల క్రితమే ఫుడ్ డెలివరీ చేసేవారు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.
Read Also: ఆ దేశంలో మగవాళ్ళు ఎంత మంచి వాళ్లో జీతం మొత్తం భార్యకే ఇస్తారట..
జపాన్ రాజధాని టోక్యోలో 90 సంవత్సరాల క్రితమే ఫుడ్ డెలివరీ చేసేవారు. 1935లో టోక్యోలో “డెమే” అని పిలిచే నూడిల్స్ డెలివరీ బాయ్స్ అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. మీరు తమ సైకిల్ మీద నూడిల్స్ ఉన్న గిన్నెలను ఒకదానిపై ఒకటి భుజం మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ డెలివరీ చేసేవారు. ఫోన్స్, బైకులు లేనప్పుడే ఈ డెలివరీ బాయ్స్ నగరం మొత్తంలో నూడిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. నాటి కాలంలో ముందుగానే వారు ఆర్డర్లు తీసుకునేవారు. వంటకం తయారైన తర్వాత సమయానికి అనుగుణంగా వాటిని సరఫరా చేసేవారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేసేవారు కాదు. నాటి రోజుల్లో ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉండేవి కావు. అందువల్లే డెలివరీ బాయ్స్ ముందుగానే ఆర్డర్లు తీసుకొని.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తుల అడ్రస్ వద్దకు వెళ్లి ఇచ్చేవారు.
ఇలాంటి సంస్కృతి ముంబై నగరంలో కూడా ఉంది. కాకపోతే అక్కడ డబ్బా వాలాలు ఇప్పటికి కూడా క్యారేజీలు డెలివరీ చేస్తున్నారు. ముంబైలో డబ్బా వాలాల యూనియన్ కూడా ఉంది. స్విగ్గి, జొమాటో లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పటికీ డబ్బా వాలాలకు గిరాకీ తగ్గడం లేదు. పైగా వారు అత్యంత నమ్మకంగా క్యారేజీలను డెలివరీ ఇస్తున్న నేపథ్యంలో డబ్బా వాలాలకు ముంబైలో ఇంకా క్రేజ్ తగ్గలేదు. డబ్బా వాలాలు గృహిణిల వద్దకు వెళ్లి క్యారేజీలు తీసుకొని.. వారి భర్తలు పనిచేసే కార్యాలయాలు లేదా పిల్లలు చదువుకునే పాఠశాలల్లో డెలివరీ ఇస్తుంటారు. క్యారేజ్ కి ఇంత చొప్పున డబ్బులు వసూలు చేస్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా ముంబై నగరంలో డబ్బా వాలాల సంస్కృతి కొనసాగుతోంది. అయితే ఇటువంటి కల్చర్ 90 సంవత్సరాల క్రితమే టోక్యోలో ఉన్న “డెమే” గా పిలిచే వ్యక్తులకు కొనసాగించారని తెలుస్తోంది.. అయితే జొమాటో కు, స్విగ్గి రూపకల్పనకు ఇటువంటి రెఫరెన్సులే ఆధారంగా పనిచేశాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.