Homeఆంధ్రప్రదేశ్‌ Satya Sai district : అక్కా చెల్లెళ్లతో పెళ్లికి రెడీ అయిన వరుడికి షాకిచ్చిన పోలీసులు!

 Satya Sai district : అక్కా చెల్లెళ్లతో పెళ్లికి రెడీ అయిన వరుడికి షాకిచ్చిన పోలీసులు!

Satya Sai district : సాధారణంగా వివాహం( marriage) అనేది ఒక యజ్ఞం లా మారిపోయింది. సరైన అమ్మాయి దొరకక చాలామంది అబ్బాయిలు సతమతమవుతుంటారు. పెళ్లి చేసుకునేందుకు చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. సంబంధాలు చూస్తూ చూస్తూ చివరకు విసిగిపోయిన వారు ఉంటారు. కానీ ఓ యువకుడికి మాత్రం అరుదైన అవకాశం దక్కింది. అలా సృష్టించుకున్నాడు ఆయన ఆ అవకాశం. ఏకంగా ఇద్దరు యువతులతో పెళ్లికి రెడీ అయిపోయాడు. అయితే ఆ ఇద్దరు యువతులు కూడా అక్కాచెల్లెళ్లు కావడం మరీ విశేషం. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read : అమరావతి టు హైదరాబాద్.. కేవలం నాలుగు గంటల్లోనే!

* నిశ్చితార్థం పూర్తి..
శ్రీ సత్య సాయి జిల్లా( Shri Satya Sai district ) గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లి కి చెందిన గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కు చెందిన ఇద్దరు యువతులతో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 10న గోరంట్లలో పెళ్లికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. వారి వివాహానికి సంబంధించి పెళ్లి కార్డు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరమ్మాయిలతో పెళ్లి.. లక్కీ చాన్స్ కొట్టేసాడు అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. దీంతో పోలీసు విచారణలో అడ్డంగా బుక్కయ్యాడు సదరు వరుడు. ఆ ఇద్దరూ అక్కా చెల్లెళ్లు అని తేలగా.. మైనర్లు అని పోలీసులు గుర్తించారు. ఆ వివాహాలను నిలిపివేయించారు. సదరు యువకుడితో పాటు కుటుంబ సభ్యులను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లను వివాహం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆ పెళ్లిని నిలిపివేశారు.

* ఇద్దరూ మైనర్లే..
అయితే ఈ ఇద్దరు యువతులు అక్కా చెల్లెళ్లు కావడం విశేషం. అందులో ఒకరికి పదహారేళ్లు , మరొకరికి 15 ఏళ్లు ఉన్నాయని తెలిసింది. వెంటనే అధికారులు( officers) ఇరువైపులా తల్లిదండ్రులను, కళ్యాణ మండపం నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిచి మాట్లాడారు. అయితే ఇద్దరితో కాకపోయినా.. ఒకరితోనైనా పెళ్లి చేసేందుకు అనుమతించాలని వారు కోరారు. కానీ ఇద్దరు మైనర్లు కావడంతో అధికారులు నిరాకరించారు. చిన్నపిల్లలకు వివాహాలు చేస్తే వచ్చే సమస్యలను వారికి వివరించారు. అయితే ఒక్క యువకుడికి ఇద్దరు అక్కచెల్లెళ్లను వివాహం జరిపించేందుకు సిద్ధపడడం వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. అయితే కేవలం వెడ్డింగ్ కార్డు వైరల్ కావడంతోనే ఈ పెళ్లి నిలిచిపోయింది. లేకుంటే సదరు యువకుడు పెళ్లి చేసుకోవడం… డ్యూయెట్లు పాడుకోవడం జరిగిపోయేది.

Also Read : బట్టలూడదీస్తావా? జగన్ కి మహిళ పోలీస్ స్ట్రాంగ్ కౌంటర్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version