Sankranthi Travel: సంక్రాంతి తెలుగువారి పండుగల్లో మరో పెద్ద పండుగ.. తెలంగాణలో దసరా తరహాలో.. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల వేడుకకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు కూడా ఆంధ్రాకు చేరుకుంటారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా పండుగ జరుపుకుంటారు. పంటలు చేతికివచ్చిన వేళ జరుపుకునే ఈ పండుగ ఎంతో ఘనంగా చేస్తారు. భోగి చిన్నపిల్లల పండుగగా, సంక్రాంతి ఆడ పిల్లల పండుగగా, కనుమ రైతుల పండుగగా పిలుస్తారు. ఇక కోనసీం, భీమవరంలో సందడి మామూలుగా ఉండదు. సంక్రాంతికి హైదరాబాద్ సగం ఖాలీ అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా మంది హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. దీంతో సంక్రాంతి ఫండుగకు సొంతూళ్లకు వెళ్తారు. గతేడాది పండుగ సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీఉకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రోడ్లపై టోల్ గేట్లు, నిర్మాణాల వల్ల అంతరాయాలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు సమగ్ర వ్యవస్థలు రూపొందించారు.
ముఖ్య డైవర్షన్ ప్రణాళికలు..
హైదరాబాద్–గుంటూరు మార్గంలో నార్కట్‌పల్లి వద్ద నల్గొండ, మిర్యాలగూడ, పిగుడురాళ్ల మార్గాలు సూచిస్తారు. రాజమండ్రి–విశాఖపట్నం మార్గంలో నకిరేకల్ ద్వారా అర్వపల్లి, మరిపెడ్ బంగ్లా, ఖమ్మం రూట్.. అటు సమస్య ఉంటే టేకుమట్ల నుంచి ఖమ్మం జెఆర్‌హెచ్ వైపు మళ్లిస్తారు. ఇక హైదరాబాద్–విజయవాడ దారిలో టేకుమట్ల డైవర్షన్ ఎత్తివేసి, తాత్కాలిక రహదారి ద్వారా సూర్యాపేట వైపు ప్రయాణించేలా చేశారు. ఖమ్మం–హైదరాబాద్ దారిలో రాయినిగూడెం యూటర్న్ బదులు చివ్వెంల, ఐలాపురం వద్ద మల్లి సూర్యాపేట మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
డ్రోన్‌తో నిఘా..
సూర్యాపేట జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో జాతీయ రహదారులపై కఠిన పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సూర్యాపేట గ్రామీణ, మునగాల, కోదాడ సర్కిల్స్ సిబ్బంది 50 రోజుల పాటు గస్తులు చేస్తారు. క్రేన్లు, అంబులెన్సులు, టోయింగ్ వాహనాలు సిద్ధంగా ఉంచారు. 24 బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర క్రాసింగ్‌ల వద్ద సీసీటీవీలు, సైనేజ్ బోర్డులు, లైటింగ్, మేల్మత్తు పనులు పూర్తయ్యాయి.