Sankranthi Special Trains 2026: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ పూర్తయింది. గత మూడు రోజులుగా పండుగ ఘనంగా జరిగింది. పండుగకు సొంత గ్రామాలకు వచ్చారు శ్రమజీవులు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు వచ్చారు. ఘనంగా పండుగ జరుపుకున్నారు ఇప్పుడు తిరుగు ప్రయాణాలకు సిద్ధమయ్యారు. అయితే తిరుగు ప్రయాణాలకు సిద్ధపడుతున్న వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖ నుంచి తెలంగాణలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రెండు రైళ్లను ఈరోజు ప్రకటించింది. విశాఖపట్నం నుంచి చర్లపల్లి కి ప్రత్యేక రైలు నెంబర్ 08517 ను ఈనెల 18వ తేదీన నడపనుంది. నిజంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల ప్రజలకు ఈ రైలు ఎంతగానో దోహదపడనుంది.
* ఈ ప్రత్యేక రైలు విశాఖలో మధ్యాహ్నం మూడు గంటల 50 నిమిషాలకు బయలుదేరనుంది. ఆ మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు చర్లపల్లి చేరనుంది.
* చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు నెంబర్ 08518 19న ఉదయం 8 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది.
* ఈ రెండు ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేటలో ఆగనుంది.
* ఈ రెండు ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసి, థర్డ్ ఏసి, స్లీపర్, సెకండ్ భోగిలను అందుబాటులో ఉంచారు. అడ్వాన్స్ బుకింగ్ కు సైతం అవకాశం కల్పించారు.