Homeఆంధ్రప్రదేశ్‌Sakshi Media Court Case: సాక్షికి కోర్టులో చుక్కెదురు

Sakshi Media Court Case: సాక్షికి కోర్టులో చుక్కెదురు

Sakshi Media Court Case: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై యుద్ధం ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు సాక్షి కి ( Sakshi media) షాక్ తగిలింది. తనకు అస్సలు సొంత ఫోన్ లేదు.. సొంత మీడియా లేదని చెబుతుంటారు జగన్ మోహన్ రెడ్డి. కానీ ఆయన అక్రమాస్తుల కేసుల్లో జగతి పబ్లికేషన్స్ సైతం కీలక భాగస్వామి. క్విడ్ ప్రో తో జగతి పబ్లికేషన్స్ లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయంటూ అప్పట్లో అభియోగాలు మోపబడ్డాయి. అయితే జగతి పబ్లికేషన్స్ విషయంలో కోర్టు విధించిన ఆంక్షలు తొలగించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ విషయంలో హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రతికూల ఆదేశాలు ఇచ్చింది.

* బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్..
దశాబ్ద కాలంగా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) అక్రమాస్తుల కేసులు కొనసాగుతూ వచ్చాయి. అప్పట్లో విదేశీ పెట్టుబడులు, క్విడ్ ప్రోకో వ్యవహారాలపై సిబిఐ, ఇది లోతైన దర్యాప్తు చేశాయి. అప్పట్లోనే జగతి పబ్లికేషన్స్ బ్యాంక్ అకౌంట్ లను ఫ్రిజ్ చేశారు. అయితే సంస్థ అత్యవసర నిర్వహణకు సంబంధించి కొన్ని బ్యాంక్ అకౌంట్లకు మాత్రం అనుమతి ఇచ్చారు. అయితే అవి సరిపోవడం లేదని.. ఫ్రీజ్ చేసిన ఖాతాలను తమకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సాక్షి. కేవలం ఆ ఖాతాలతో విదేశాలకు నిధులు తరలించుకోవాలని చూస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి.

* దశాబ్దాలుగా కేసు..
పుష్కర కాలంగా జగన్ అక్రమాస్తుల కేసులు విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. అసలు కేసులో ట్రయల్ ప్రారంభం కాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరడం, రకరకాల పిటిషన్లతో కాలయాపన చేయడం ద్వారా ప్రధాన నిందితులు గడువు పొందే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే జప్తు చేసిన ఆస్తులు నేరపూరిత సంపాదనగా నిర్ధారించిన తరుణంలో.. నిందితులు కోర్టు ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు, డిస్చార్జ్ పిటిషన్లను త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాన ట్రయల్ ప్రారంభించేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version