Homeఆంధ్రప్రదేశ్‌Sai Krishna Missing Case: సాయి కృష్ణ ఎపిసోడ్.. జగనే కార్నర్!

Sai Krishna Missing Case: సాయి కృష్ణ ఎపిసోడ్.. జగనే కార్నర్!

Sai Krishna Missing Case: రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రస్తావించి ప్రతిపక్షంగా నిరూపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది. కేవలం విపక్ష నేత హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తానని భీష్మించుకు కూర్చున్నారు. ప్రతిపక్షనేత హోదా రాలేదు కాబట్టి నేను పోరాటం చెయ్యను అన్నట్టు ఉంది ఆయన వ్యవహార శైలి. అయితే ఇప్పుడు అనవసరంగా సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం కేసును ప్రస్తావించి రాజకీయం చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఫలితం ఇవ్వకపోగా వికటించింది. ఎందుకంటే ఆ తల్లి ఆవేదనలో తప్పులేదు. ఆ కుటుంబ బాధలో కూడా తప్పులేదు. ఎంతటి కఠినమైన వారు అయినా పిల్లలు తప్పు చేసినా.. వారు ఇబ్బందులకు గురైన తట్టుకోలేరు. అలాగే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి బాధపడ్డారు. తన కుమారుడు అదృశ్యం తో విలవిలలాడిపోయారు. ఆది నుంచి ఒకటే మాట ఆవిడ నోటి నుంచి వస్తోంది. తన కుమారుడు చనిపోయి ఉంటే చెప్పాలని.. కనీసం బూడిదైనా ఇవ్వాలని ఆమె కోరారు.

* అంబటి ప్రస్తావనతో..
సాయి కృష్ణ అదృశ్యం గురించి తొలుతా ప్రస్తావించింది మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే బాధ్యత కుటుంబం పై మానవీయకోణం చూపడం కంటే.. సాయి కృష్ణ కాపు జాతికి చెందిన యువకుడిగా మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న వయసులో తప్పిదాలు సహజం అని.. ఆ నేరాలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి సైతం కాపు అంశాన్ని హైలెట్ చేసేందుకు మాత్రమే ప్రయత్నం చేశారు. ఆ తల్లి ఆవేదన, ఆ కుటుంబ ఆవేదన, అసలేం జరిగింది, సాయి కృష్ణ ఎలాంటి వాడు, ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు.. అనే అంశాలను పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఎంతవరకు ఇది ప్రభుత్వ హత్యగా చిత్రీకరించే ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి అనే కోణంలోనే ఆరోపణలు చేశారు.

* బాధ్యతగా సీఎం చంద్రబాబు..
అయితే చంద్రబాబు రంగంలోకి దిగారు. అప్పటివరకు తీవ్ర ఆవేదనతో రోదించిన ఆ తల్లిని పిలిపించుకుని మాట్లాడారు. కుటుంబ సభ్యులను తన వద్దకు రప్పించుకొని సాయి కృష్ణా ప్రాథమిక స్థాయి నుంచి ఎలా ఉండేవాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేవలం ఆ తల్లి తన కుమారుడి గురించి గొప్పగా చెప్పలేదు. నేర ప్రవృత్తి గురించి కూడా చెప్పుకొచ్చింది. ఒక మాతృమూర్తిగా ఆమె గోడు విన్నారు చంద్రబాబు. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమ కుమారుడు బతికి ఉంటే అప్పగించాలని.. చనిపోయి ఉంటే అందుకు కారకులను శిక్షించాలని వారు కోరారు. అందుకు స్పష్టమైన హామీ ఇచ్చారు చంద్రబాబు. ఐపీఎస్ అధికారిని విచారణకు నియమించారు. బాధ్యుడైన సిఐను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసును నమోదు చేశారు. సీఎం చంద్రబాబు తమ పట్ల చూపిన దయ, చొరవతో అప్పటివరకు ఆగ్రహంగా మాట్లాడిన సాయి కృష్ణ తల్లి తో పాటు కుటుంబ సభ్యులు ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

* అడ్డంగా బుక్కైన జగన్..
ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా కాకుండా రాజకీయ లబ్ధి కోసమే ఆయన ప్రయత్నించారని స్పష్టమైంది. కాపుల విషయంలో చీలిక తేవాలన్న ఆలోచనకు ఆదిలోనే దెబ్బ పడింది. అటు సాయి కృష్ణ తల్లితోపాటు కుటుంబ సభ్యులు సైతం జగన్మోహన్ రెడ్డి తీరును ఇప్పుడు తప్పు పట్టారు. కనీసం తన కుమారుడి పేరు కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి వచ్చారని బాంబు పేల్చారు. ఇంకోవైపు తమ సామాజిక వర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డబుల్ గేమ్ ను కాపులు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అంతకుమించి నేర ప్రవృత్తిని వెనుకేసుకు రావడం పై కూడా విద్యాధికులు, తటస్తులు తప్పుపడుతున్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ రాలేదు సరి కదా.. దారుణంగా డ్యామేజ్ జరిగింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular