RP Sisodia: వైసీపీ నేతల భూకబ్జా ప్లాన్ ను బయట పెడుతున్న ఆర్పి సిసోడియా!

గత ఐదేళ్లలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ భూములకు రెక్కలు వచ్చాయి. అసైన్డ్ భూములు జిరాయితీగా మారాయి. నేతల బినామీ చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వం మారడంతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

Written By: Dharma, Updated On : August 17, 2024 3:50 pm

Rp sisodia

Follow us on

Rp sisodia : వైసిపి హయాంలో భూహక్కులకు సంబంధించి చాలా రకాల జీవోలు వచ్చాయి. అందులో అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ ఒకటి. డీ పట్టా భూములను.. నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించి జిరాయితీగా మార్చారు. అటు తర్వాత ఆ భూములకు రెక్కలు వచ్చాయి. పెద్ద ఎత్తున పట్టాలు మారాయి. ఒక ఫ్రీ ప్లాన్ ప్రకారం ఈ విధానాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూములను మార్చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి స్కాం జరిగిందని గుర్తించారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర పరిధిలోని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను నాటి ప్రభుత్వ పెద్దలే దోచుకున్నారని గుర్తించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన ఆయిష్టత చూపారు. ఇంకా పదవీకాలం ఉండగానే సెలవులపై వెళ్లిపోయారు. ఉత్తరాంధ్రలో తన కుటుంబ సభ్యుల పేరిట భారీగా అసైన్డ్ భూములు సేకరించారు అన్నది ఆయనపై వచ్చిన ఆరోపణ. వాస్తవానికి ఉత్తరాంధ్రలో.. ప్రధానంగా విజయనగరం జిల్లాలో ప్రభుత్వ భూములు అధికం. ఆపై అసైన్డ్ భూములు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకేనాటి పెద్దల కన్ను ఆ జిల్లా పై పడింది. ఇష్టా రాజ్యంగా సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. వివాదాస్పద భూములను, వాటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్నారు. వివాదాస్పద భూములకు సంబంధించి బాధితుల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో నాటి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

* ఆ ఫైళ్ళ దగ్ధంతో..
కొద్ది రోజుల క్రిందట చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసుకొని పక్కదారి పట్టించిన తీరు వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం కాలేదని.. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కాం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రను బేస్ చేసుకుని నాటి వైసిపి ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున భూదందా జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆర్పీ సిసోడియా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్ర నుంచి తన ఆపరేషన్ ను ప్రారంభించారు.

*:ప్రత్యేక వ్యూహంతో..
వాస్తవానికి మదనపల్లె ఘటనకు సంబంధించి ఆర్ పి సిసోడియా ఒక ప్లాన్ ప్రకారం గుట్టును బయటకు లాగారు. ఒకవైపు పోలీస్ దర్యాప్తు కొనసాగుతూనే.. రెవెన్యూ పరంగా లోతైన విచారణ చేపట్టారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ గా మార్చి.. జిరాయితీగా మార్చేసి దోచుకున్నారన్న వైనాన్ని గుర్తించారు. కచ్చితంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా అప్లై చేసి ఉంటారని అనుమానించారు. అందుకు అనుగుణంగా పావులు కదపడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర నుంచి విచారణను మొదలుపెట్టారు.

* విజయనగరం జిల్లాలో
మాజీ సిఎస్ జవహర్ రెడ్డి పై పెద్ద ఎత్తున భూఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటి లెక్కను తేల్చి చెప్పే పనిలో పడ్డారు సిసోడియా. భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ గత ప్రభుత్వ హయాంలో భీ పట్టా భూములు జిరాయితీగా మారిన తర్వాత రిజిస్ట్రేషన్లు జరిగాయి అన్నది ఫిర్యాదు. అందుకు సంబంధించి 120 ఎకరాలు జిరాయితీగా మార్చారని గుర్తించారు. వాటికి సంబంధించిన రికార్డులను, భూములను పరిశీలించారు. ఈ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ లావాదేవీలను ప్రజల ముందు ఉంచేందుకే ప్రభుత్వం ఆర్పి సిసోడియాకుప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.