Roja comments on Nagababu: ఎందుకో మెగా ఫ్యామిలీ అంటే మాజీ మంత్రి రోజా విరుచుకుపడుతుంటారు. ఆమె వైసీపీ హయాంలో మంత్రి అయినప్పుడు నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్లారు. అంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు తో కలిసి బుల్లితెరలో జబర్దస్త్ షో చేశారు. ఎన్నెన్నో కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొన్నారు. అయితే రోజా మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ షో కు రావడం మానేశారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం ఆ షో నుంచి తప్పుకున్నారు. అయితే మంత్రి పదవిపోయి.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన రోజా తిరిగి జబర్దస్త్ లోకి రావాలి అనుకుంటే అనుమతి లభించలేదన్న టాక్ ఉంది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఉంటూ.. బుల్లితెర షోల్లో పాల్గొంటున్నారు. దానినే తప్పు పడుతున్నారు మాజీ మంత్రి రోజా. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో విమర్శలు..
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోజా జబర్దస్త్ షో చేశారు. అయితే ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ.. అటువంటి షోలు చేయడం ఏమిటనేది సోషల్ మీడియా వేదికగా వచ్చిన కామెంట్. అయితే ఆమె షోలు చేయడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న భావన వైసిపి నేతల్లో కూడా ఉండేది. అయితే ఎమ్మెల్యేగా ఉండే వరకు ఓకే కానీ.. తరువాత మంత్రిగా మారిన తర్వాత జబర్దస్త్ షోలకు గుడ్ బై చెప్పారు రోజా. దక్షిణ భారతదేశంలోనే ఈ షో ఎంతో ఆకట్టుకుంది. వివిధ కారణాలతో రోజా కంటే ముందే అశోక్ నుంచి తప్పుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. బుల్లితెర షోలకు హాజరవుతున్నారు.
దక్కని అవకాశాలు..
నగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రోజా. మళ్లీ బుల్లితెరలో బిజీ కావాలని భావించారు. అనుకున్న మేర అవకాశాలు దక్కలేదు. కానీ అధికార పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. ఆయనకు మాత్రం యధావిధిగా బుల్లితెర షోల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఎంత మాత్రం రోజాకు మింగుడు పడడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అయితే ఎమ్మెల్సీ అయిన వారు సైతం మళ్లీ షో లకు వస్తున్నారని.. తనను మాత్రం తప్పు పట్టారంటూ నాగబాబుపై పరోక్ష విమర్శలు చేశారు రోజా. అయితే తనకు దక్కనిది నాగబాబుకు దక్కిందన్న ఆవేదన ఆమెలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో రోజాపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.