Homeఆంధ్రప్రదేశ్‌RK Roja: ఒక్క 'ఆట'తో రూ.20 కోట్లు కొట్టేసిన రోజా

RK Roja: ఒక్క ‘ఆట’తో రూ.20 కోట్లు కొట్టేసిన రోజా

RK Roja: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో జరిగిన వైఫల్యాలు, అవినీతిని బయటపెడుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు మద్యం కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో కుంభకోణం పై ఫుల్ క్లారిటీ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భారీ అవినీతి జరిగిందని దర్యాప్తు లో తేలింది. రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కీలక నివేదిక ఇచ్చింది. అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉండేవారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ శాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉండేవారు. ఇప్పుడు వారిద్దరి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పకుండా అరెస్టు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది. నివేదిక ప్రభుత్వానికి అందడంతో సీరియస్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

* అడుగడుగునా అవినీతి..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆడుదాం ఆంధ్ర ( adudam Andhra)పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. కానీ అప్పట్లో సుదీర్ఘకాలం కొనసాగాయి క్రీడా పోటీలు. క్రీడా పరికరాల కొనుగోలుతో పాటు నిర్వహణలోనూ అడుగడుగునా అవినీతి జరిగిందన్నది అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై కూటమి అధికారంలోకి రాగానే విచారణ ప్రారంభం అయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత కొద్దిరోజులుగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దర్యాప్తు కొనసాగింది. అయితే చివరిగా రూ.20.37 కోట్లు దోచుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చింది. అయితే ఇందులో ఆర్కే రోజా తో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వారి అరెస్టు తప్పదన్న ప్రచారం మొదలైంది.

* అనుభవం,అర్హత లేని వారికి..
ఏదైనా కాంట్రాక్టు అప్పగించే ముందు అనుభవం, అర్హతలు పరిశీలిస్తారు. కానీ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణ కాంట్రాక్టును తగిన అనుభవం, అర్హతలు లేని తమ కుటుంబ సన్నిహితుడికి కట్టబెట్టారు మంత్రి ఆర్కే రోజా. అప్పటి శాప్ చైర్మన్ హోదాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన ప్రధాన అనుచరుడిని ముందు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. అప్పట్లో ఆడుదాం ఆంధ్రకు సోషల్ మీడియాలో ప్రచారం పేరిట కూడా వైసిపి ఇన్ఫ్లుయెన్సర్లకు భారీగా నగదు మొట్ట చెప్పినట్లు తేలింది. బ్రాండింగ్, వీడియో, ఫోటోగ్రఫీ ల పేరుతో భారీగా నిధులు దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది.. నాసిరకమైన క్రీడా పరికరాలతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని గుర్తించింది. మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అతని ప్రధాన అనుచరుడైన శాప్ ఐటీ కన్సల్టెంట్ జీకే కిషోర్ బాబు పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏసీబీ లేదా సిఐడి కి అప్పగించాలని విజిలెన్స్ అండ్ అన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

* ప్రచార దుర్వినియోగం..
ఆడుదాం ఆంధ్రాలో రోజాతో పాటు సిద్ధార్థ రెడ్డి అవినీతి చేశారని స్పష్టంగా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో ఐప్యాక్ సభ్యురాలికి ప్రచార ఖర్చుల నిమిత్తం భారీగా కేటాయించినట్లు గుర్తించింది దర్యాప్తు సంస్థ. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతోనే కేటాయింపులు చేసినట్లు గుర్తించడం విశేషం. ఈ మొత్తం వ్యవహారంలో రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టార్గెట్ కానున్నారు అన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version