TTD Darshan Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను నవంబర్ 11న విడుదల చేసింది. సర్వ దర్శనం కోసం చాలా సేపు క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. దీంతో రూ.300 ల దర్శనంతో స్వామి వారిని కనీసం రెండు మూడు గంటల్లోనే దర్శించుకోవచ్చు. అక్టోబర్ నెల 21న విడుదల చేయాల్సిన టికెట్ల విడుదలలో అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. భక్తుల కోరిక మేరకు ఈ టికెట్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మన కుటుంబ సభ్యుల పేర్లతో టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనికి గాను www.tirupatibalaji. ap. gov. in లో మన ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇంకా ఆన్ లైన్ లోనే మనకు లడ్డూలు ఎన్ని కావాలనే ఆప్షన్ కూడా ఇస్తుంది. అందులోనే మన లడ్డుల సంఖ్యను పేర్కొనవచ్చు. డబ్బును ఆన్ లైన్ పేమెంట్ ద్వారానే కట్టుకోవడంతో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సాధారణంగా స్వామి దర్శనం మనకు సులభంగా జరుగుతుంది.
ఇంకా రూం బుకింగ్ కు కూడా టీటీడీ అవకాశం ఇస్తోంది. నవంబర్ 13న రూములకు సంబంధించిన టికెట్లు కూడా అందుబాటులోకి తేనుంది. భక్తుల నుంచి వచ్చిన కోరికల మేరకు రూ.300 దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు టికెట్లు ఆన్ లైన్ లో విక్రయిస్తారు. ఈ టికెట్లు డిసెంబర్ నెలలో అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 16, 31 తేదీలు మినహా మిగతా తేదీలకు గాను టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. దీనికి గాను టీటీడీ చర్యలు తీసుకుంటుంది.

గోవింద యాప్ ద్వారా టికెట్లు విడుదల చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా కాలంలో రెండు సంవత్సరాలు శ్రీవారి దర్శనానికి ఎవరు రాకుండా పోవడంతో ఇప్పుడు కరోనా నిబంధనలు ఎత్తివేశారు. దీంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులోకి తేవడంతో ఇక భక్తులకు తిప్పలు లేకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే భక్తులకు కల్పించే సదుపాయాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటోంది.