Registration Fees In AP: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించింది. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ రిజిస్ట్రేషన్ భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాట్ విలువను రెండు భాగాలుగా విభజించి.. బేస్ ధరపై 7.5%, అభివృద్ధి చార్జీలపై 0.5% రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ణయించారు. గతంలో ఉన్న 7.5% ఫీజు విధానాన్ని సవరిస్తూ.. ఒకే ప్లాట్ ను రెండు దస్తావేజుల కింద రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇది ఉపశమనం కలిగించే విషయం. మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో 10 నెలల పాలన.. విపత్తులు, ప్రమాదాలు, వివాదాలు!
* ప్రభుత్వమే నేరుగా వెంచర్లు
ప్రభుత్వమే నేరుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. వాటికే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ ( NTR smart township )అని పేరు పెట్టారు. అయితే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఒకే ప్లాట్ ను రెండు రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త విధానం ప్రకారం ప్లాట్ విలువను రెండు భాగాలుగా విభజిస్తారు. బేస్ ధర కింద 60 శాతం, అభివృద్ధి చార్జీలు కింద 40 శాతంగా లెక్కిస్తారు. 60 శాతం మొత్తం పై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. మిగిలిన 40% పై కేవలం 0.5% మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
* అప్పట్లో భారీగా ఫీజు
గతంలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లో ఉన్న ప్లాట్ మొత్తం విలువపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు( registration fee ) ఉండేది. ఇది సామాన్యులకు భారంగా ఉండేది. అందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిఆర్డిఏ తో పాటు విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లను ప్రారంభించారు. లాటరీ ద్వారా ప్రజలకు ప్లాట్లు కూడా విక్రయించారు. అయితే తాజా నిర్ణయంతో ప్లాట్లు కొనుగోలు చేసిన గునుగోలుదారులందరికీ భారం తగ్గనుంది. కాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా అధికారులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు భారీ ఊరట దక్కనుంది.
* అన్నిచోట్ల ప్రారంభించాలని వినతి
ప్రస్తుతం సిఆర్డిఏతో( crda) పాటు వీఎంఆర్డీఏ పరిధిలో మాత్రమే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన స్థలాల ఎంపిక కూడా పూర్తయింది. కొన్నిచోట్ల లాటరీ తీసి స్థలాలను కూడా కేటాయించారు. అటువంటి వారికి రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపు మినహాయింపు ఇవ్వడం.. ఉపశమనం కలిగించే విషయం. వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా ఈ టౌన్ షిప్ లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: ఆ వైసీపీ మాజీ ఎంపీ రాజకీయ నిష్క్రమణ!