Ibomma Ravi: కొత్త సినిమాలను పైరసీ చేసి .. తన సైట్లో పెడుతున్నాడు ఇమ్మడి రవి. ఐ బొమ్మ పేరుతో నిర్వహిస్తున్న ఆ వెబ్సైట్లో కొత్త సినిమాలు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల తెలుగు చిత్రంతో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో రవిని తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఈ విచారణలో రవి ఈ యొక్క విషయాలను వెల్లడిస్తున్నాడు. ఆ విషయాలను పోలీసులు మీడియాకు లీక్ చేస్తున్నారు..
పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడిస్తున్న రవి.. తాజాగా మరో విషయాని కూడా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఐ బొమ్మ వెబ్సైట్లో ఐ అంటే ఇమ్మడి అని.. అందువల్లే ఆ వెబ్ సైట్ కు ఐ బొమ్మ అని పేరు పెట్టాడని ప్రచారం జరిగింది. అయితే ఐ బొమ్మకు ఆ ఆ పేరు పెట్టడానికి కారణం వేరే ఉందని తెలిసింది. ఆ విషయాన్ని ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి స్వయంగా వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ అని అర్థమట. విశాఖపట్నంలో సినిమాను బొమ్మ అని పిలుస్తారట. అందుకే రవి ఆ పేరు పెట్టాడట. రెండో వెబ్సైట్ కు అతడు బలపం అని పేరు పెట్టాడు. సాంకేతికపరమైన కారణాల వల్ల దానిని బప్పం అని మార్చాడట. ఏది ఏమైనప్పటికీ విచారణలో రవి రోజుకో తీరుగా సంచలన విషయాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో ఐ బొమ్మ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. కొంతమంది రవికి కఠినమైన జైలు శిక్ష పడుతుందని చెబుతుంటే.. మరి కొందరేమో అతడికి ఎటువంటి శిక్ష పడదని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొద్దిరోజులుగా నిత్యం వార్తల్లో ఉంటున్న రవి.. రెండు తెలుగు రాష్ట్రాల మీడియాకు విపరీతమైన పని కల్పిస్తున్నాడు.
ఐ బొమ్మ రవి వ్యవహారం తర్వాత అతని కుటుంబానికి సంబంధించిన విషయాలను సరికొత్తగా రెండు తెలుగు రాష్ట్రాల మీడియా సంస్థలు ప్రజెంట్ చేశాయి. దీంతో అతడిని సెలబ్రిటీని చేశాయి. ఇక ఇదే క్రమంలో కొంతమంది న్యాయవాదులు అతడి తరఫున వాదించడానికి ముందుకు వచ్చారు . ఇక సోషల్ మీడియాలో అయితే రవికి అనుకూలంగా ఒక ఉద్యమమే నడుస్తోంది. సాక్షాత్తు సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేసేదాకా పరిస్థితి వెళ్ళిందంటే.. రవి రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు..