Jagan Mohan Reddy Election Strategy: 2019లో చాలా సక్సెస్ ఫార్ములాలను అనుసరించింది వైయస్సార్ కాంగ్రెస్. అప్పట్లో ఎన్నో రకాల ప్రయత్నాలు, పాటలు, నినాదాలు.. ఇలా ఒక్కటేంటి అన్ని రకాల యత్నాలతోనే సక్సెస్ సాధించింది ఆ పార్టీ. ముఖ్యంగా ‘రావాలి జగన్ కావాలి జగన్’ నినాదం ఒక ఊపు ఊపేసింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఇటువంటి నినాదాలు పనిచేయలేదు. ఫ్లాప్ షో మిగిలింది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. కానీ వెనక్కి తగ్గే ఛాన్స్ లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే మావిగన్ నినాదంతో 2029 ఎన్నికలకు వెళ్లాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. వాటికి సంబంధించిన ప్రచార వస్త్రాలను కూడా సిద్ధం చేయడం విశేషం.
Also Read: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు
* అప్పట్లో ఆ స్లోగన్..
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూపర్ విక్టరీ కొట్టింది. 151 సీట్లలో ఘనవిజయం సాధించింది. అయితే ఆ సమయంలో ‘రావాలి జగన్ కావాలి జగన్’ నినాదం ఏపీలో మార్మోగిపోయింది. ప్రజల నుంచి విపరీతమైన స్పందన కూడా వచ్చింది. ఆ ఎన్నికల్లో ఈ స్లోగన్ బాగా కలిసి వచ్చింది. జనాలను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో మరో కొత్త స్లోగన్ తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.’ రావాలి జ’గన్’.. కావాలి మావి’గన్’ పేరుతో ఒక కొత్త స్లోగన్ ఏర్పాటయింది. ఆ పార్టీ నేత కారుమూరు వెంకట్ రెడ్డి పేరుతో భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవి నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినవా? లేకుంటే అజ్ఞాత వ్యక్తులు ఏర్పాటు చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
* విస్తృత ప్రచారం..
‘ మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే.. త్వరగా అభివృద్ధి చెందాలి అంటే.. మావిగన్ రాజధాని కారిడార్ అవ్వాలి. అది జగనన్నతోనే సాధ్యం.. మన రాజధాని మావిగన్.. మావిగన్ ఆంధ్ర ప్రదేశ్ కు గ్రోత్ ఇంజన్’ వన్ టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ చివర్లో.. అంతేకాదు లక్షల కోట్ల అప్పులు తీసుకురాకుండా.. అతి తక్కువ ఖర్చుతో 60 లక్షల జనాభాతో రెడీమేడ్ రాజధాని మావిగన్ అని రాశారు. ఈ ఫ్లెక్సీలతో కూడిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మావిగన్ పై విపరీతమైన వ్యతిరేకత వచ్చిన తరుణంలో.. సొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకించిన పరిస్థితుల్లోనే ఈ కొత్త స్లోగన్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి.