Ramoji Rao: పాత్రికేయమంటే కాలిక స్పృహ ఉండాలి. అంటే ఎప్పటి కాలంలో జరిగితే అప్పటి రోజే ఆ వార్తలను అచ్చు వేయాలి. లేదా పౌర సమాజానికి ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే నాటి సంఘటనలను ఉటంకిస్తూ వార్తలను రాయాలి. కథనాలను ప్రచురించాలి. అలాగని పేపర్ ఉంది.. ఇష్టం వచ్చినట్టు రాసేస్తా. నచ్చని వాళ్లను తొక్కేస్తా.. అనుకూలంగా లేని వారిని బజారుకు లాగుతా.. విషం చిమ్ముతా అంటేనే మొదటికి మోసం వస్తుంది. ఇంతకీ ఏంటయ్యా అంటే.. ఈరోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పచ్చదనం కుదించి.. ప్రజాధనం భుజించి.. అని ఒక శీర్షిక న బ్యానర్ వార్త ప్రచురితమైంది. తరచి చూస్తే అది జగన్ నెగిటివ్ కోణంలో అనేది అర్థమవుతూనే ఉంది.. ఇప్పుడు అర్జెంటుగా జగన్ దిగిపోవాలి.. చంద్రబాబు అధికారంలోకి రావాలి కాబట్టి.. ఈనాడు ఇలానే రాస్తుంది. పైగా అడ్డగోలుగా వక్రీకరణలకు దిగుతోంది.
తాజాగా ఈనాడు రాసిన ఆ వార్తకు సంబంధించి విషయం ఏంటంటే..రామ్ కీ అనే సంస్థ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయిన సాక్షిలో పెట్టుబడులు పెట్టింది. అందువల్లే సాక్షి పత్రిక తనకు పంటిలో రాయిలాగా మారింది అనేది ఈనాడు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే ఈనాడు తనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా తట్టుకోలేదు. నాడు ఉదయం పేపర్ ను, వార్త పేపర్ ను ఎలా నాశనం చేసిందో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు సాక్షి కూడా తనను మించి ఎదగకూడదనేది ఈనాడు గట్టి పంతం. అందుకే ఆ పత్రికలో ఎవరైనా పెట్టుబడులు పెడితే అప్పట్లో అడ్డగోలుగా వార్తలు రాసింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి మేళ్ళు జరిగాయి కాబట్టి.. అందుకే వారంతా సాక్షిలో పెట్టుబడులు పెట్టారు అనేది ఈనాడు ప్రధానమైన ఆరోపణ. అయితే వీటికి సంబంధించిన సాక్షాలు నేటికీ లేకపోవడంతో 10 సంవత్సరాలుగా ఆ కేసు నానుతూనే ఉంది. ఎప్పటికీ కొలిక్కి వస్తుందో తెలియదు గానీ.. ఆ విషయాన్ని మాత్రం ఈనాడు మర్చిపోవడం లేదు. అందుకే ఎన్నికల ముందు రోజుకో రకంగా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేక వార్తలు రాస్తుంది. వాస్తవానికి రామ్ కీ కంపెనీ విషయంలో ఈనాడుకు కనిపించిన వ్యతిరేక విధానం అమర్ రాజా బ్యాటరీస్, కియా కంపెనీలో కనిపించకపోవడం విశేషం. ఈ రెండు కంపెనీలు బోలెడంత కాలుష్యాన్ని కుమ్మరిస్తున్నప్పటికీ ఈనాడు కిక్కురు మనదు. ఎందుకంటే అవి చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పడిన సంస్థలు కాబట్టి.. పైగా చంద్రబాబునాయుడు వాటిని బాగా ప్రమోట్ చేశాడు కాబట్టి.. ఈనాడు వెనకేసుకొస్తుంది.
జగన్ ప్రభుత్వం రామ్ కి కంపెనీ విషయంలో ఏమాత్రం నిబంధనలు పట్టించుకోవడంలేదని.. ఆ కంపెనీకి వత్తాసు పలుకుతున్నారని చెబుతున్న ఈనాడు.. తాను చేస్తున్నది ఏమిటో చెప్పడం లేదు. నేటికీ రామోజీ ఫిలిం సిటీ లో ఉన్న భూముల్లోకి పేదలను రానివ్వడం లేదు. ప్రభుత్వం పేదలకు ఆ స్థలాలు పంపిణీ చేసినప్పటికీ.. వారిని అందులోకి రానివ్వకుండా పెద్ద పెద్ద గేట్లు అడ్డం పెడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల గోనే ప్రకాశరావు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ వార్త ఒక సాక్షిలో తప్ప దేంట్లోనూ ప్రచురితం కాలేదు. అంతేకాదు మొన్నటిదాకా విజయవాడ ఈనాడు కార్యాలయానికి రోడ్డు విస్తరణకు మినహాయింపు ఇచ్చారంటే రామోజీ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఆ కార్యాలయం ఆ స్థల యజమానుల చేతుల్లోకి వెళ్లిపోయింది కాబట్టి రామోజీరావు తన కార్యకలాపాలను లెనిన్ నగర్ కు మార్చుకోవాల్సి వచ్చింది. కేవలం విజయవాడ మాత్రమే కాదు సీతమ్మధార స్థలం విషయంలోనూ ఇదే వివాదం కదా. ఆ స్థల యజమాని ఆర్థికంగా స్థితిమంతుడు కాబట్టి రామోజీరావు మీద గెలవగలిగాడు. లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. గురిగింజ తన నలుపు తాను ఎరుగన్నట్టు.. రామోజీరావు తన తప్పులు తాను తెలుసుకోకుండా.. జగన్ మీద అడ్డగోలుగా వార్తలు రాయడం.. ప్రతిష్టాత్మక సంస్థల మీద విషం చిమ్మడం అనేవి దారుణమని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు కోణంలో ఒకలాగా.. జగన్ కోణంలో మరొక లాగా రామోజీరావు వ్యవహరించడాన్ని వారు తప్పుపడుతున్నారు. పత్రికకు కాలికా స్పృహ ఉండాలని.. ప్రత్యేకమైన ఏజెండా ఉంటేనే తేడా వస్తుందని వారు ఉదహరిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ramoji rao is writing news from the perspective of chandrababu and the other from the perspective of jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com